‘శ్రీవల్లీ’ సాంగ్ ట్యూన్‌ను వాడేసిన యూపీ కాంగ్రెస్: ఆకట్టుకునేలా వీడియో సాంగ్

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ అదే బాటలో నడిచింది. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ 'పుష్ప' సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని పాటలు కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని బాగా పాపులర్ అయిన శ్రీవల్లీ పాటను కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాస్రంగా మార్చేసింది. శ్రీవల్లి పాట ట్యూన్‌ను తీసుకుని ఉత్తరప్రదేశ్ గొప్పతనాన్ని చెబుతూ ఈ పాటను రూపొందించింది. 'చూపే బంగారమాయేనే శ్రీవల్లి..' పాట మ్యూజిక్‌తో.. తూ హై గజాబ్ యూ, యూపీ.. తేరీ కసమ్, యూపీ(చాలా అందంగా ఉంటావు యూపీ అంటూ) వీడియో పాటను చిత్రీకరించింది.

Congress launches song to tune of Srivalli from Pushpa film for UP polls: Tu hai gazab, UP.

రాణీ లక్ష్మీబాయి వంటి గొప్ప వ్యక్తులు పోరాడిన నేల అంటూ.. ఉత్తరప్రదేశ్ గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియో సాంగ్ ను యూపీ కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఉత్తరప్రదేశ్ వాసులం అయినందుకు గర్వంగా ఉంది అంటూ పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది.

ఇది ఇలావుండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ సదర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి సమక్షంలో యోగి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. ఆయన నామినేషన్ వేసే ముందు గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసిన ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు.

Recommended Video

    UP Elections 2022 : UP ఓటర్లకు PM Modi విజ్ఞప్తి..రికార్డుల్ని బ్రేక్ చేసేద్దాం | Oneindia Telugu

    గోరఖ్‌పూర్‌లో ప్రస్తుతానికి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యర్థిగా భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించడానికి ముందు అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యోగిపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఉత్తరప్రదేశ్‌ను మాఫియాల నుంచి యోగి ఆదిత్యనాథ్ విముక్తి చేశారని కొనియాడారు. 25 ఏళ్ల తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో చట్టబద్ధ పాలనను నెలకొల్పారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+