మన దగ్గర ఇంతమంది దేశద్రోహులు ఉన్నారా..? కాంగ్రెస్ నేత మాజీ పీఏ అరెస్ట్
భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న దేశద్రోహుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు గూఢచారులు పట్టుబడి విచారణలో ఉండగా, తాజాగా మరో సంచలనాత్మక అరెస్ట్ చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన సకూర్ ఖాన్ అనే ప్రభుత్వ ఉద్యోగి, ఒక రాజకీయ పార్టీ నేత మాజీ పీఏను ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సకూర్ ఖాన్ ఆరేడుసార్లు పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చాడని అధికారులు తెలిపారు.
ఈ తరచు పర్యటనలు ఆయనపై అనుమానాలను మరింత బలపరిచాయి.సకూర్ ఖాన్ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా, అందులో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నంబర్ల గురించి సకూర్ ఖాన్ సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం గూఢచర్యం కోణాన్ని మరింత స్పష్టం చేసింది.ఖాన్ ఫోన్‌లో సైనిక రహస్య సమాచారం ప్రత్యక్షంగా లభించనప్పటికీ, కొన్ని కీలక ఫైళ్లను డిలీట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇది ఆయన నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు.

సకూర్ ఖాన్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక లావాదేవీల ద్వారా మరిన్ని వివరాలు వెలికి తీయాలని చూస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ఒక రాజకీయ నేతకు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి గూఢచర్యానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అరెస్ట్‌తో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని, అంతర్గత నిఘాను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. సకూర్ ఖాన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇంకెంతమందికి సంబంధాలున్నాయి, ఎలాంటి రహస్య సమాచారం పాకిస్థాన్‌కు చేరిందనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications