• search

ప్రధాని మోడికి గురువు ఎల్ కే అద్వానీ మీద లేని ప్రేమ దేవేగౌడ మీద ఎందుకు: డ్రామాలు!

By Mallikarjuna
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడను ప్రధాని నరేంద్ర మోడీ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. రాజకీయ గురువు ఎల్ కే అడ్వాణి మీద లేని ప్రేమ జేడీఎస్ పార్టీ నేత దేవేగౌడ మీద ఎలా వచ్చింది అంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ శ్రీగిల్ ప్రశ్నించారు.

    బీజేపీ ‘బీ'టీఎం

    బీజేపీ ‘బీ'టీఎం

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ శ్రీగిల్ బుధవారం మంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు. జేడీఎస్ పార్టీ బీజేపీ బీ టీం అని జైవీర్ శ్రీగిల్ ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్ కలిసి ఓటర్లను తప్పుదోవపట్టిస్తున్నారని జైవీర్ శ్రీగిల్ ఆరోపించారు.

    డ్రామాలు అడుతున్నారు

    డ్రామాలు అడుతున్నారు

    బీజేపీతో హెచ్ డీ. కుమారస్వామి చేతులు కలిపితే కుటుంబం నుంచి బహిష్కరిస్తానని ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ అంటున్నారని జైవీర్ శ్రీగిల్ గుర్తు చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, దేవేగౌడ కుమారుడు హెచ్ డీ. కుమారస్వామి రహస్యంగా భేటీ అవుతున్నారని జైవీర్ శ్రీగిల్ ఆరోపించారు.

    ప్రధాని మోడీ డైలాగులు

    ప్రధాని మోడీ డైలాగులు

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, హెచ్ డీ. కుమారస్వామి భేటీ అనంతరం ప్రధాని మోడీ రంగంలోకి వచ్చారని జైవీర్ శ్రీగిల్ అన్నారు. బీజేపీ బహిరంగ సభలో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడను ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు పొగడ్తలతో ముంచెత్తారు ప్రజలకు చెప్పాలని జైవీర్ శ్రీగిల్ డిమాండ్ చేశారు.

    హృదయంలో ఉన్నారు

    హృదయంలో ఉన్నారు

    మంగళవారం ఉడిపిలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడను కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానించారని ఆరోపించారు. హెచ్.డి. దేవేగౌడ దేశానికి సేవ చేశారని ఆయన సేవలు మరిచిపోలేమని, ఆయన నా హృదయంలో ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు.

    ఎల్ కే అద్వానీ ఎక్కడున్నారు

    ఎల్ కే అద్వానీ ఎక్కడున్నారు

    హెచ్.డి. దేవేగౌడ మీ హృదయంలో ఉంటే మీ రాజకీయ గురువు ఎల్ కే అద్వానీ ఎక్కడున్నారని జైవీర్ శ్రీగిల్ ప్రధాని మోడీని ప్రశ్నించారు. మొదట బీజేపీ సీనియర్ నాయకులు, మీ రాజకీయ గురువు ఎల్ కే. అద్వానీ కి విలువ ఇవ్వాలని, కర్ణాటకకు వచ్చి ఎన్నికల డ్రామాలు ఆడకూడదని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత జైవీర్ శ్రీగ్రిల్ హితవుపలికారు.

    English summary
    Speaking to media person in Mangaluru congress spokesperson Jaiveer Shergil hit out Prime minister Narendra Modi for praising HD Deve Gowda

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more