Viral Video: రాహుల్ గాంధీకి ముద్దుపెట్టిన యువతి! (వీడియో)
Viral Video: మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన "ఛాత్రోం కీ గూంజ్"(విద్యార్థుల ప్రతిధ్వని) కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురైన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభా ప్రాంగణంతో విద్యార్థులతో మమేకమవుతున్న సమయంలో ఓ యువ విద్యార్థిని రాహుల్ గాంధీ చెంపపై ముద్దు పెట్టుకోవడం నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
సభా వేదికపై అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరైన ఈ "ఛాత్రోం కీ గూంజ్" కార్యక్రమంలో యువతతో పాటు పలువురు విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో ఓ యువతి సెల్ఫీ తీసుకున్న వెంటనే అనుకోకుండా ఆయన చెంపపై ముద్దు పెట్టింది. ఈ ఘటనతో కొద్దిసేపు ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ.. వెంటనే చిరునవ్వుతో ఆ విద్యార్థినితో కొద్దిసేపు మాట్లాడి సరదాగా పలకరించారు. ఆ తర్వాత తన భద్రతా సిబ్బందితో కలిసి రాహుల్ గాంధీ వేదిక దిగి వెళ్లిపోయారు.

సోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ వద్ద మహిళలు, యువత చాలా సురక్షితంగా, సౌకర్యవంతంగా భావిస్తారనడానికి ఈ సంఘటనే నిదర్శనమని కొందరు కామెంట్ల వర్షం కురిపించారు. మరికొందరు ఆ క్షణాన్ని చాలా ముద్దుగా ఉందంటూ కామెంట్లు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
ఈ కార్యక్రమం కేవలం ఈ సరదా సంఘటనతోనే కాకుండా రాజకీయంగానూ వేడిని రాజేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మనుస్మృతి మనస్తత్వంపై, పితృస్వామ్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కేశవ్ ఉపాధ్యే ఈ కార్యక్రమాన్ని ఓ రాజకీయ హాస్య ప్రదర్శనగా అభివర్ణించారు. విద్యార్థుల అసలు సమస్యలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ జనాన్ని సమీకరించడానికి ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేత సచిన సావంత్ ఖండించారు. రాహుల్ గాంధీకి యువత నుంచి లభించిన అపూర్వ స్పందనను చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
How lucky is this girl? 😭🫶🎀
— Amock (@Politicx2029) August 23, 2026
She got to meet Rahul Gandhi and even kissed him. 😭❤️
Never seen any baddies this comfortable with any BJP leader🔥 pic.twitter.com/j0Z9KWxZGL












Click it and Unblock the Notifications