సోనియమ్మ లవ్ స్టోరీ.. తొలి చూపులోనే మనసును గెలుచుకున్నారు
భారత రాజకీయాల్లో దశాబ్దాలుగా అత్యంత కీలకమైన వ్యక్తిగా, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వేదిక 'ఎక్స్'లో ఖాతా తెరిచిన ఆమె, తన జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను, తొలి పరిచయపు అందమైన క్షణాలను పంచుకున్నారు. త్వరలో తను రాబోతున్న తన ఆటోబయోగ్రఫీ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఒక వీడియో రూపంలో విడుదల చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రెస్టారెంట్‌లో తొలి పరిచయం
ఇంగ్లాండ్‌లో విద్యార్థిగా ఉన్న రోజుల్లో తనకు ఇటాలియన్ ఆహారం కావాలనిపించి వెతుకుతుండగా ఈ అద్భుతమైన పరిచయం జరిగిందని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. యూరప్ దేశాల విద్యార్థులతో పాటు చాలా మంది భారతీయ విద్యార్థులు కూడా వచ్చే ఒక గ్రీకు రెస్టారెంట్‌ను తాము కనుగొన్నట్లు ఆమె తెలిపారు. "అక్కడే నేను రాజీవ్ గాంధీని తొలిసారి కలిశాను. ఆయనను చూసిన క్షణమే.. నేను ఎవరితోనైతే జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటానో, ఆ వ్యక్తి ఆయనేనని నా మనసుకు అనిపించింది. అచ్చం అలాగే ఆయన మనసులో కూడా అదే భావన ఉందని తర్వాత నాకు అర్థమైంది" అంటూ ఆమె తన తొలి ప్రేమ అనుభూతిని పంచుకున్నారు.
In a small Greek restaurant in Cambridge my journey of love began. Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you. https://t.co/zvN5Rqqstf
— Sonia Gandhi (@SoniaGandhi) October 24, 2026
మొదటి చూపులోనే మనసును హత్తుకున్న సౌమ్యత
ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తనకు రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడిందని సోనియా గాంధీ తెలిపారు. ఆ తర్వాత ఇద్దరం కలిసి.. ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీలకు వెళ్లడం, సీటి అంతా తిరగడం వంటివి చేశామని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ చక్కని రూపం మాత్రమే కాకుండా, ఆయనలోని అత్యంత సున్నితమైన స్వభావం, మృదువైన ప్రవర్తనే తనను మొదటి చూపులోనే విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. ఆ రోజు తన మనసులో నాటుకుపోయిన ఆ మంచితనాన్ని, ఆయన సౌమ్యతను తాను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని ఎమోషన్ అయ్యారు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకున్న వీరు ఫిబ్రవరి 25, 1968న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అనురాగం, బాధ్యత, విషాదాల సమాహారంగా ఆత్మకథ
సోషల్ మీడియాలో కేవలం 'ఎక్స్' మాత్రమే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడుగుపెట్టిన సోనియా గాంధీ, తన సరికొత్త జ్ఞాపకాల పుస్తకం గురించి అభిమానులతో పంచుకున్నారు. "అందరికీ నమస్కారం, నా జీవిత పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' మొదటి లుక్‌ను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది" అంటూ ఆమె వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. యుద్ధానంతర ఇటలీలో తన బాల్యపు రోజులు, తనను భారతదేశానికి రప్పించిన ఆ అద్భుతమైన ప్రేమ ప్రయాణం, జీవితాన్ని తీవ్రంగా మార్చివేసిన వ్యక్తిగత విషాదాలు, తాను దత్తత తీసుకున్న ఈ దేశంతో ముడిపడిన అనుబంధం.. ఈ పుస్తకంలో ప్రతి అంశాన్ని హృద్యంగా పొందుపరిచినట్లు ఆమె తెలిపారు.














Click it and Unblock the Notifications
