Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లాన్ మొత్తం రివర్స్, ఆయమ్మ కాకపోతే ఈయమ్మ అన్నట్లు ఉంది, సుమలతకు ఆ పార్టీ టిక్కెట్ ఆఫర్?

లోక్ సభ ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలు సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. ఇదే ఏడాది దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని, మోదీకి హ్యాట్రిక్ గ్యారెంటీ అని బీజేపీ నాయకులు బలంగా చెబుతున్నారు.

కర్ణాటకలోని అన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచిన నియోజక వర్గం మండ్య. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఇప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మండ్య రాజకీయాలు భారత్ మొత్తం తిరిగి చూసేలా చేస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటి చేసిన తెలుగింటి ఆడపడుచు సుమలతా అంబరీష్ సంచలన విజయం సాధించారు.

Congress party leaders are planning to give Mandya Lok Sabha ticket if Sumalata Ambarish is not given BJP MP ticket

అదే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కుమారుడు, మాజీ ప్రధాని మనుమడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామిని చిత్తుగా ఓడించిన సుమలతా అంబరీష్ ఎంపీగా విజయం సాధించారు. అయితే సుమలతా అంబరీష్ కు బీజేపీ బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఓట్లు దాదాపుగా ఆమెకే పడ్డాయి. అయితే ఇదే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న జేడీఎస్ ఇప్పుడు మండ్య లోక్ సభ నియోజక వర్గం మీద కన్ను వేసింది.

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎంపీ సుమలతా అంబరీష్ కు బీజేపీ సీటు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెలుగు చూసింది. మరోసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలతా అంబరీష్ పోటీ చేస్తే ఆమె గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మండ్య ప్రజలు అంటున్నారు. బీజేపీ టిక్కెట్ మీద కాకుండా సుమలతా సొంతంగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఆమె ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. ఇదే సందర్బంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేసిందని వెలుగు చూసింది.

Congress party leaders are planning to give Mandya Lok Sabha ticket if Sumalata Ambarish is not given BJP MP ticket

బీజేపీ టిక్కెట్ ఇవ్వకుంటే, సుమలతాను ఆపార్టీతో తెగతెంపులు చేసుకుని బయటకు వస్తే ఆమెకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారని తెలిసింది. సుమలతా భర్త, రెబల్ స్టార్ అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా, కర్ణాటక మంత్రిగా పని చేసిన అంబరీష్ తరువాత అనారోగ్యంతో చనిపోయారు. అయితే జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ గత లోక్ సభ ఎన్నికల్లో సుమలతాకు సీటు ఇవ్వకుండా నిఖిల్ కుమారస్వామికి మద్దతు తెలిపింది.

ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతా అంబరీష్ కు బీజేపీ బయటి నుంచి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆమె నిఖిల్ కుమారస్వామిని ఓడించి ఎంపీగా విజయం సాధించారు. యడియూరప్పతో పాటు కొందరు బీజేపీ నాయకులు, అంబరీష్ అభిమానులు సుమలతాకు అండగా నిలబడటంతో గత లోక్ సభ ఎన్నికల్లో సుమలతా సంచలన విజయం సాధించడంతో దేశం మొత్తం ఒక్కసారి మండ్య వైపు చూసింది.

Congress party leaders are planning to give Mandya Lok Sabha ticket if Sumalata Ambarish is not given BJP MP ticket

మండ్య లోక్ సభ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం సుమలతాకు అండగా ఉండాలని నిర్ణయించారని తెలిసింది. ఎందుకంటే చాలెంజింగ్ స్టార్ దర్శన్, కేజీఎఫ్ హీరో యశ్ సైతం సుమలతాకు అండగా ఉన్నారు. సుమలతా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

అయితే మండ్య లోక్ సభ నియోజక వర్గం సీటు దక్కకపోతే బీజేపీ హైకమాండ్ సుమలతాకు బెంగళూరులో ఏదైనా నియోజక వర్గం కేటాయిస్తారా, లేక మరోచోట ఆమెకు అవకాశం కల్పిస్తారా అని వేచి చూడాలని అంబరీష్ అభిమానులు అంటున్నారు. సుమలతా అంబరీష్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా ఆ పార్టీ నాయకులు, మండ్య జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలతో సుమలతా అంబరీష్ టచ్ లోనే ఉన్నారు. సుమలతా అంబరీష్ కు కాంగ్రెస్ పార్టీ మండ్య లోక్ సభ సీటు ఇంత వరకు ఆఫర్ ఇవ్వపోయినా లోలోపల చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+