ఆ జిల్లా పేరు మారుతుందా?

ఏపీ తరహాలోనే పొరుగునే ఉన్న కర్ణాటకలో జిల్లాల పేర్ల మార్పు మళ్లీ తెరమీదికి వచ్చింది. గతంలో బెల్గాం, షిమోగ, బిజాపూర్, గుల్బర్గా వంటి జిల్లాల పేర్లను మార్చారు. బెళగావి, శివమొగ్గ, విజయపుర, కలబురగిగా మార్పు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా డిమాండ్ ఊపందుకుంటోన్నట్టే కనిపిస్తోంది.

బెంగళూరుకు ఆనుకుని ఉన్న రామనగర జిల్లా పేరును దక్షిణ బెంగళూరుగా మార్చాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుబట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినతిపత్రాన్ని సైతం అందజేశారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఉండటం చర్చనీయాంశమైంది.

Congress leaders urged to Siddaramaiah to rename the Ramanagara district as Bengaluru South

రామనగర జిల్లా పరిధిలోని రామనగర, చెన్నపట్టణ, కనకపుర, మాగడి, హారోహళ్లి తాలూకాలో ఉండగా.. మెజారిటీ బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కనకపుర, మాగడి, హారోహళ్లి తాలూకాల్లోని అనేక గ్రామాలు బెంగళూరు సౌత్ లోక్‌సభ పరిధిలోనివే. కనకపుర- డీకే శివకుమార్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం.

నగర పరిధి శరవేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రామనగర పేరును దక్షిణ బెంగళూరుగా మార్చాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్, మంత్రి రామలింగారెడ్డి, అశ్వర్థ.. తదితరులు సచివాలయంలో సిద్ధరామయ్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

గతంలో ఆయా ప్రాంతాలన్నీ కూడా బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలో ఉండేవి. దొడ్డబళ్లాపుర, నెలమంగళ, యలహంక, దేవనహళ్లి, అనేకల్, బెంగళూరు సౌత్, బెంగళూరు ఈస్ట్, హోస్కోటే, రామనగర, మాగడి, కనకపుర, చెన్నపట్టణ తాలూకాలు బెంగళూరు రూరల్ జిల్లాలో భాగం.

పరిపాలన సౌలభ్యం కోసం 2007లో రామనగర జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రామనగర, మాగడి, కనకపుర, చెన్నపట్టణ, హారోహళ్లి తాలూకాలను ఇందులో విలీనం చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా రామనగర పేరును దక్షిణ బెంగళూరు జిల్లాగా మార్చాలంటూ డిమాండ్ చేస్తోన్నారు కాంగ్రెస్ నాయకులు. దీని వెనుక రియల్ ఎస్టేట్ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+