నగ్మాకి ముద్దు, సైలెన్స్:బాగోలేదన్నందుకు బహిష్కరణ!

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ప్రచారం కోసం నగ్మా ఆదివారం హపూర్‌కు వచ్చినప్పుడు గజరాజ్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా హతాశురాలైన నగ్మా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం అన్ని చానల్స్‌లోనూ ప్రసారమైంది.
ఇంత జరిగినా కాంగ్రెస్ మాత్రం గజరాజ్‌పై ఎలాంటి చర్యా తీసుకోలేదట. పైగా గజరాజ్ అలా చేయడం ఏం బాగోలేదన్న ప్రమోద్ కాత్యాయన్ అనే నాయకుడి పైన బహిష్కరణ వేటు వేసిందంటున్నారు.
గజరాజ్‌ను అలా వదిలి వేయడానికి కారణాలు లేకపోలేదంటున్నారు. ఆయన పలుకుబడి కలిగిన బిసి నేత అని, ఎన్నికల టైంలో ఆయన జోలికెళ్తే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారట.












Click it and Unblock the Notifications