కాంగ్రెస్ మానిఫెస్టో అత్యంత భ‌యాన‌కం..! ప్ర‌మాద‌క‌ర వాగ్దానాలను పొందుప‌రిచార‌న్న జైట్లీ..!!

ఢిల్లీ/హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన ఎన్నిక‌ల మేనిఫెస్టోపై భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. అమ‌లుకాని హామీలను మానిపెస్టోలో పొందుప‌రిచిన కాంగ్రెస్ పార్టీ అనే బ‌దులుగా, మేనిఫెస్టోలో ప్ర‌మాద‌క‌ర అంశాల‌ను పొందుపురిచార‌ని బీజేపి ఘాటుగా స్పందించింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో వ‌ల్ల దేశ‌ప్ర‌జ‌లు అనేక క‌ష్టాలు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోని క్ష‌ణ్నంగా ప‌రిశీలించిన అనంత‌రం బీజేపి స్పందించింది.

 రాజ‌కీయ ప్ర‌యోజనాల కోస‌మే కాంగ్రెస్ మేనిఫెస్టో..! తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన బీజేపి..!!

రాజ‌కీయ ప్ర‌యోజనాల కోస‌మే కాంగ్రెస్ మేనిఫెస్టో..! తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన బీజేపి..!!

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు చోటుచేసుకున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. ఇండియాను విడగొట్టే ఆలోచన మేనిఫెస్టోలో కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం విడుదల చేశారు. దీనిపై జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 'దేశద్రోహం' చట్టాన్ని ఎత్తివేయాలని వారు (కాంగ్రెస్) చెబుతున్నారని, ఇందుకు సిద్ధమవుతున్న పార్టీకి ఒక్క ఓటు కూడా పొందే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు.

మేనిఫెస్టోలో ప్ర‌మాద‌క‌ర అంశాలు..! ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌న్న జైట్లీ..!!

మేనిఫెస్టోలో ప్ర‌మాద‌క‌ర అంశాలు..! ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌న్న జైట్లీ..!!

రాహుల్ గాంధీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రమాదకరమైనమని, అయితే దేశ ప్రజలు ఆయన నమ్మే పరిస్థితిలో లేరని జైట్లీ పేర్కొన్నారు. 'టుక్డే టుక్డే గ్యాంగ్'లోని కాంగ్రెస్ అధ్యక్షుడి మిత్రులు ఈ మేనిఫెస్టోకు డ్రాఫ్టింగ్ చేసినట్టుందని ఎద్దేవా చేశారు. ఇండియాను విడదీసే ఆలోచనలు మేనిఫెస్టోలో కనిపిస్తున్నాయన్నారు. దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టో ప‌ట్ల ఆక‌ర్శితిలు కావొద్ద‌ని పిలుపునిచ్చారు.

 ఉగ్ర‌వాద ప్ర‌స్థావ‌న అవ‌స‌ర‌మా..? సూటిగా ప్ర‌శ్నించిన క‌మ‌లం పార్టీ..!!

ఉగ్ర‌వాద ప్ర‌స్థావ‌న అవ‌స‌ర‌మా..? సూటిగా ప్ర‌శ్నించిన క‌మ‌లం పార్టీ..!!

ఉగ్రవాదంపై పోరు 26/11తో ప్రారంభం కాలేదని, ఇండియాను విడగొట్టాలని చూస్తున్న శక్తులు చాలాకాలంగా దేశంలో చురుకుగా పనిచేస్తున్నాయని జైట్లీ అన్నారు. '70 ఏళ్ల పాటు సాగించిన తప్పిదాలే ఇవాళ కశ్మీర్ పరిస్థితికి కారణమ‌ని, చట్టబద్ధ పాలనను మేము ఏర్పాటు చేస్తుంటే, ఉగ్రవాదుల, చొరబాటుల రూల్స్‌ కోసం కాంగ్రెస్ పాటుపడుతోంది' అని ఆయన విమర్శించారు. కశ్మీర్ పండిట్ల ప్రస్తావన నామ‌మాత్రంగా నైనా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చోటుచేసుకోలేదని అన్నారు.

దేశాన్ని ముక్క‌లు చేయ‌డ‌మే కాంగ్రెస్ అభిమ‌తం..! విరుచుకుప‌డ్డ అరుణ్ జైట్లీ..!!

దేశాన్ని ముక్క‌లు చేయ‌డ‌మే కాంగ్రెస్ అభిమ‌తం..! విరుచుకుప‌డ్డ అరుణ్ జైట్లీ..!!

జీఎస్‌టీ సింగిల్ శ్లాబ్‌పై మాట్లాడుతూ, ప్రతి వస్తువుపై ఒకే రేటు (సింగిల్ శ్లాబ్) ఎలా వేయగలమని ఆయన ప్రశ్నించారు. 'పేదరికపు రేఖకు దిగువన ఉన్నవారు ఎక్కువ జీఎస్‌టీ ఉన్న వస్తువులను ఎలా కొనుగోలు చేయగలుగుతారు? అర్ధంలేని హామీలివి' అని జీఎస్‌టీపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ దీర్గ‌కాలిక ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ద్రుష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించింద‌ని జైట్లి విరుచుకు ప‌డ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+