ఎన్టీఆర్‌పై అర్థం చేసుకోండి!, కేంద్రమంత్రితో సచిన్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడం పైన కాంగ్రెస్ పార్టీ సభ్యలు భగ్గుమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానాశ్రయం పేరు విషయంలో కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
డొమెస్టిక్ టర్మినల్‌కు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ పేరు పెట్టలేదని టీడీపీ, బీజేపీ సభ్యులు ప్రతిగా మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరును మారుస్తున్నామంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రులు అశోక గజపతిరాజు, నిర్మాలా సీతారామన్ ఆరోపించారు. డొమెస్టిక్ టెర్మినల్‌కు పాత పేరును పునరుద్ధరించామన్నారు.
ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ విమాశ్రయం బేగంపేటలో ఉన్నప్పుడు రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ పేర్లు ఉండేవని, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మరో విమానాశ్రయం అవసరం ఏర్పడిందని, అప్పుడు శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు కట్టారని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, రాజీవ్ పేరు అలాగే ఉంచి, ఎన్టీఆర్ పేరును విడిచిపెట్టారన్నారు. తాము ఇప్పుడు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతున్నామన్నారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరును కొత్తగా పెట్టడంలేదని, పాత పేరునే పునరుద్ధరిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ పేరు తాము పెట్టడం లేదని, ఉన్న పేరే అని అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ పేరును విడిచిపెట్టిందని, ఆ తప్పును మేం సరిదిద్దామన్నారు.

కాంగ్రెస్
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ పార్లమెంటు ఎదుట కాంగ్రెస్ సభ్యుల ధర్నా.

కాంగ్రెస్
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ పార్లమెంటు వద్ద గల మహాత్ముడి విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యుల ధర్నా.

ప్రకాశ్ జవదేకర్
కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ బుధవారం నాడు పార్లమెంటు ప్రాంగణంలో....

కేంద్రమంత్రితో సచిన్
కేంద్ర క్రీడాశాఖ మంత్రి సోనోవాల్‌ను రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ బుధవారం కలిశారు. బాక్సర్ సరితా దేవికి న్యాయం చేయాలని కోరారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications