డ్ర‌గ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు..

ఈ మ‌ధ్యకాలంలో డ్ర‌గ్స్ కేసులు ఎక్కువైపోయాయి. మొన్న‌టిమొన్న డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ న‌టుడు పేరు తెర‌ముందుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఒక సినీ నిర్మాత పేరు కూడా బ‌య‌టికి రావ‌డం మ‌నం చూశాం. కానీ ఇప్పుడు ఓ రాజ‌కీయ నాయ‌కుడిని డ్ర‌గ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో ఆ వార్త పార్టీ నాయ‌కులను ఆందోళ‌ను గురిచేసింది. ఇంత‌కీ ఆ రాజ‌కీయ నేత ఎవ‌రో తెలుసుకుందాం. కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద నమోదైన పాత డ్రగ్స్ కేసుకు సంబంధించి సుఖ్‌పాల్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ మంజీత్ సింగ్, డీఎస్పీ ఏఆర్ శర్మ నేతృత్వంలో పంజాబ్ పోలీసులు గురువారం ఉదయం 6:30 గంటలకు చండీగఢ్‌లోని సుఖ్‌పాల్ సింగ్ ఇంటిపై దాడి చేసిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు.

అద‌న‌పు నిందితుడిగా సుఖ్‌పాల్‌సింగ్‌..
సుఖ్‌పాల్‌సింగ్ పాత కేసును గ‌న‌క పరిశీలిస్తే, 2015 మార్చిలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణ కొనసాగుతుండగానే రెండు కిలోల హెరాయిన్, 24 బంగారు బిస్కెట్లు, ఒక దేశీయ పిస్టల్, రెండు పాకిస్థానీ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీన ప‌రుచుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 2017లో తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించారు. దాని తర్వాత అదనపు నిందితుడిగా సుఖ్‌పాల్ సింగ్ ఖైరా పేరు విచారణలో బయటపడింది. 2021లోఅదే ఎఫ్‌ఐఆర్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుఖ్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసింది. అయితే 2022లో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక, 2023 ఫిబ్రవరి 16 డ్రగ్స్ కేసులో సుఖ్‌పాల్ సింగ్ ఖైరాపై సమన్ల ఉత్తర్వులను న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

Congress MLA arrested in drug case

ఫేస్‌బుక్ ఖాతాలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం..
ప్ర‌స్తుతం పోలీసులు తన ఇంటికి వచ్చి సుఖ్‌పాల్ సింగ్‌న్ అరెస్టు చేసిన విజువల్స్‌ను సుఖ్‌పాల్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేశారు. అందులో ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ తన ఇంటికి వచ్చిన పోలీసులతో వాదనకు దిగ‌డం చూడొచ్చు. పోలీసులను వారెంట్ అడ‌గ‌డం అందులో క‌నిపిస్తుంది. ఈ క్రమంలో పాత ఎన్‌డీపీఎస్ కేసులో డీఐజీ ర్యాంక్ అధికారి, ఇద్దరు ఎస్‌ఎస్‌పీల నేతృత్వంలోని సిట్ నిర్వహించిన దర్యాప్తు సిఫారసు మేరకు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ కేసును ఇప్పటికే సుప్రీం కోర్టు రద్దు చేసిందని ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ పేర్కొన్నారు. ఇక, ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసి జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు ఆయన కుమారుడు మెహతాబ్ ఖైరాకు చెప్పడం కూడా వీడియోలో మ‌నం చూడొచ్చు.

Congress MLA

అరెస్టును ఖండించిన కాంగ్రెస్ అధ్యక్షుడు..
అయితే ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్‌ను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఖండించారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను బెదిరించడం, ప్రధాన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ఆప్ ప్రభుత్వం ఎత్తుగడగా దీనిని ఆయన పేర్కొన్నారు. తాము ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాకు మద్దతుగా ఉంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+