వివాదం: నగ్మాకు పబ్లిగ్గా ముద్దుపెట్టిన ఎమ్మెల్యే!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గంలో నామినేషన్ కార్యక్రమంలో ప్రముఖ సినీ తార నగ్మాతో స్థానిక కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు గిరిరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. నగ్మా కాంగ్రెసు పార్టీ తరఫున మీరట్ నుండి లోకసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆమె నామినేషన్ దాఖలు సమయంలో ఎమ్మెల్యే గిరిరాజ్... నగ్మాను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమయింది. ఎమ్మెల్యే తీరుతో నగ్మాతో పాటు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, నగ్మా అభిమానులు షాకయ్యారు. ఎమ్మెల్యే పైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిరాజ్ ప్రజాప్రతినిధి అనే హోదాను మరిచిపోయి సాటి మహిళా నేతతో అనుచితంగా ప్రవర్తించారని పలువురు మండిపడుతున్నారు.

కాగా, శనివారం నామినేషన్ దాఖలు విషయంలో నగ్మాకు చుక్కెదరైన విషయం తెలిసిందే. మీరట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా నగ్మా శనివారం నాడు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే, ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేయలేకపోయారు. నామినేషన్ పత్రాలు తీసుకుని వచ్చిన వ్యక్తిని పోలీసులు కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించలేదని, దీంతో తాను నామినేషన్ వేయలేకపోయానని ఆమె అన్నారు.
పత్రాలను, అఫడవిట్లను తెస్తున్న జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు సలీం భారతిని పోలీసులు లోనికి అనుమతించలేదని, కలెక్టర్ కార్యాలయం గేటు వద్దనే ఆపేశారని ఆమె చెప్పారు. ప్రతి అభ్యర్థితో ఐదుగురు వ్యక్తులు లోనికి రావచ్చు. రేపు నామినేషన్ దాఖలు చేస్తానని, ఈ విషయంపై సీనియర్ పార్టీ నాయకులతో మాట్లాడుతానని ఆమె చెప్పారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/N56ioQjXD-w?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications