వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులను గుడ్డలూడదీసి కొడతానన్న ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అర్ధరాత్రి దాటిన తర్వాత బార్లలో మద్యం తాగొద్దని చెప్పిన పోలీసులపై ఓ ప్రజాప్రతినిధి వారిపై చిందులుతొక్కాడు. అంతటితో ఆగకుండా వారిని వెంబడించి మరీ తిట్ల పురాణం చదివి వారి మీద చేయి చేసుకున్నాడు. పోలీసుల వద్ద ఉన్న కెమెరాను లాక్కున్న ఆయన, అసెంబ్లీలో గుడ్డలూడదీసి కొడతానని వారిని హెచ్చరించాడు. ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యహరించడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హుంగుండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్(42) తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి మంగళవారం రాత్రి పుట్టిన రోజు చేసుకుంటున్నారు. ఆ పార్టీలో కొందరు రౌడీ షీటర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. విఠల్ మాల్యా రోడ్డులోని యుబి సిటీ 16వ అంతస్తులో లాంజ్ బార్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాతా కూడా పెద్ద సౌండుతో పాటలు, మద్య సేవనం కొనసాగుతున్నాయి.

Congress MLA slaps cops, threatens to strip them

నగరంలో రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లకు అనుమతి ఉండగా.. ఇది రాత్రి ఒంటి వరకు కొనసాగింది.

దీంతో ఆ సౌండును, గందరగోళాన్ని భరించలేని చుట్టపక్కల వాళ్లు కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ హ్యాండ్ కెమెరాతో అక్కడికి వెళ్లారు.

అక్కడ జరుగుతున్నదంతా చిత్రీకరించారు. దీంతో పోలీసులను చూసిన ఆ ఎమ్మెల్యేకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నారు. నేనెవరో తెలుసా' అంటూ వాళ్ల చేతిలోని కెమెరా లాక్కున్నారు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్లు తిట్టిన ఆ ఎమ్మెల్యే.. వారిపై చేయి చేసుకున్నాడు. ఇంకా వారిని అసెంబ్లీలో గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించి మరీ పంపించేశాడా ప్రజాప్రతినిధి.

English summary

 For the second time in less than a week, conscientious policemen were at the receiving end of highhanded politicians in their line of duty. A Congress MLA partying beyond the stipulated hour at Skyye, an upmarket lounge bar, allegedly abused, chased and slapped two constables who came in to enforce the law past Tuesday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X