ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్.. ఎక్కడ.. ఎందుకంటే..
విలాసవంత జీవితమో.. లేదా అధికార దర్పమో తెలియదు గానీ.. కొందరు యువత మాత్రం రెచ్చిపోతున్నారు. వీరిలో రాజకీయ నేతల కుమారులే ఎక్కువగా ఉంటున్నారు. నిన్న రాత్రి బెంగళూరులో కూడా ఓ పుత్ర రత్నం రెచ్చిపోయాడు. ఏకంగా ఖాకీ పైనే చేయబోయాడు. తీరా అతను ఎవరా అని గుర్తిస్తే ఎమ్మెల్సీ పుత్రరత్నం అని తేలింది.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు గురించే మనం ఇప్పటివరకు చెప్పుకుంది. ఫయాజ్ నిన్న రాత్రి ఫూటుగా మద్యం సేవించాడు. అర్థరాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేయబోయాడు. కారులో ఫయాజ్‌తోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఇవాళ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అమృతల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఫయాజ్, మరో ఇద్దరు కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. ఆ సమయంలో ఫయాజ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. తన కారునే ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. హెబ్బాల్ ఫ్లై ఓవర్ సమీపంలో పోలీసు బలగాలపై దాడి చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ సీకే బాబా తెలిపారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగి హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఫయాజ్ మద్యం సేవించాడని పోలీసులు చెబుతున్నారు. ఫయాజ్‌పై ఐపీసీ సెక్షన్ 353 కింద అభియోగాలు మోపారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications