Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ గాంధీ యాక్టివ్ మోడ్: అనర్హత వేటు ఎత్తేసిన తరువాత తొలిసారిగా..

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. మోదీ ఇంటిపేరు వ్యవహారంలో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం, ఆ వెంటనే అనర్హత వేటు తొలగిపోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌లో జోష్ నింపాయి.

అదే ఊపుతో కాంగ్రెస్ పార్టీ.. ఇవ్వాళ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జోరుగా చర్చ సాగిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ తరుణ్ గొగొయ్.. ఇవ్వాళ ఈ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. డింపుల్ యాదవ్, సుప్రియా సులే, సౌగత్ రాయ్, పినాక మిశ్రా.. ఇలా పలువురు సభ్యులు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్నారు. ఈ తీర్మానంపై రాహుల్ గాంధీ ఇవ్వాళ మాట్లాడట్లేదు. బుధవారం ఆయన ప్రసంగం షెడ్యూల్ అయింది.

 Congress

కాగా- అనర్హత వేటును ఎత్తేసిన తరువాత తొలిసారిగా కేరళలోని వాయనాడ్‌కు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఈ నెల 12, 13 తేదీల్లో వాయనాడ్‌లో పర్యటించనున్నారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో వాయనాడ్‌ నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికైన విషయం తెలిసిందే.

అనర్హత వేటు పడినప్పుడూ ఆయన వాయనాడ్‌లో పర్యటించారు. తనను గెలిపించిన మలయాళీలకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు అప్పట్లో. ఇప్పుడు మరోసారి సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. 12, 13 తేదీల్లో ఆయన షెడ్యూల్ ఖరారైనట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రోడ్ షోలో పాల్గొంటారని, బహిరంగ సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి కేరళ పీసీసీ నాయకులు ఏర్పాట్లు చేస్తోన్నారు.

కాగా- లోక్‌సభ సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఇంకా బంగళాను కేటాయించాల్సి ఉంది. అనర్హత వేటు పడినప్పుడు దీన్ని ఖాళీ చేశారాయన. ఇప్పుడు అదే బంగళాను కేటాయిస్తారని తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులు రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఈ దేశమే నా ఇల్లు.. క్లుప్తంగా సమాధానం ఇచ్చారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+