ధరల మంట: స్టేట్‌బ్యాంకు 'టమోటా', లక్నోలో వినూత్నంగా....

స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమోటా‌' కొత్తగా ప్రారంభమైంది. టమోటా ధరలు విపరీతంగా పెరగడంతో ఈ బ్యాంక్‌ ప్రారంభమైంది. ఈ బ్యాంకులో టమోటాలను దాచుకొంటే రెట్టింపు టమోటాలను కొంత కాలం తర్వాత తీసుకోవచ్చు.

లక్నో: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమోటా‌' కొత్తగా ప్రారంభమైంది. టమోటా ధరలు విపరీతంగా పెరగడంతో ఈ బ్యాంక్‌ ప్రారంభమైంది. ఈ బ్యాంకులో టమోటాలను దాచుకొంటే రెట్టింపు టమోటాలను కొంత కాలం తర్వాత తీసుకోవచ్చు. ఈ బ్యాంకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

టమోటాలకు బ్యాంకు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఇరుకుపెట్టేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ తరహ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Congress opens ‘State Bank of Tomato’ in Lucknow to protest against rising prices
టమోటా బ్యాంక్ తన వినియోగదారులకు అన్ని ప్రాథమిక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రతి లావాదేవీ టమోటాకు సంబ:దించి ఉంటుంది.

బ్యాంకు యొక్క వినియోగదారుడు టమోటాల లాకర్స్, రుణాల సౌకర్యంతో డిపాజిట్ కూడ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ వినూత్న టమోటా బ్యాంకు బయట వినియోగదారులు బారులు తీరి కన్పించారు.

కొందరు వినియోగదారులు తాము టమోటాలను డిపాజిట్ చేసుకొనేందుకు వచ్చినట్టు చెప్పారు. ధరలు పెరిగిన దృష్ట్యా టమోటాలు చోరికి గురైతాయనే భయపడుతున్నట్టుగా ఓ వినియోగదారుడు చెప్పారు.

500 గ్రాముల టమోటాను డిపాజిట్ చేశాను. ఆరు మాసాల తర్వాత కిలో టమోటాలు వస్తాయనే ఆనందంతో మరో వినియోగదారుడు చెప్పారు.

లక్నోలో కాంగ్రెస్ పార్టీ ఈ వినూత్నంగా ఈ తరహ నిరసనను వ్యక్తం చేసింది. టమోటాల ధరలు విపరీతంగా పెరడంతో ప్రభుత్వ తీరును ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నిరసనకు పూనుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+