ప్రధాని మోదీ టీమ్ కు షాక్ ఇచ్చిన సీఎం, ఏదో అనుకుంటే ఇలా జరిగింది ఏంటి రామా!

బెంగళూరు టీచర్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక-2024 (ఎమ్మెల్సీ)ల్లో బీజేపీ-జేడీఎస్ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టన్న 1, 506 ఓట్ల తేడాతో గెలుపొందారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంది.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమిగా పోటీ చేశాయి. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని బీజేపీ హైకమాండ్ జేడీఎస్‌కు అప్పగించింది. బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ఎ. పి. రంగనాథ్ రంగంలోకి దిగారు. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నికలో 15 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టన్న 963 ఓట్ల మెజారిటీతో సత్తాచాటారు. ఆ తర్వాత కూడా ఆధిక్యాన్ని కొనసాగించాడు. చివరకు 1,506 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుట్టన్న గెలుపొందారు.

Congress party candidate won in Bengaluru Upadhyay MLC by-election

బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పుట్టన్న నాలుగుసార్లు విధాన పరిషత్‌కు ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన పరిషత్ సభ్యుడిగా ఉండగానే ఎమ్మెల్సీ పదవికి, , బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ, విధాన పరిషత్ సభ్యత్వానికి రాజీనామా చేసిన పుట్టన్న కాంగ్రెస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులోని రాజాజీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఆయనను పోటీకి దింపింది.

ఈ నియోజకవర్గంలో పుట్టన్నకు 50, 564 ఓట్లు వచ్చాయి. అయితే అదే నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. సురేశ్‌కుమార్‌ చేతిలో పుట్టన్న ఓడిపోయారు. పుట్టన్న రాజీనామాతో ఖాళీ అయిన బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి (ఎమ్మెల్సీ) ఉప ఎన్నికల తేదీ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పుట్టన్న మళ్లీ విధాన పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Congress party candidate won in Bengaluru Upadhyay MLC by-election

బీజేపీ-జేడీఎస్ కలిసి వచ్చి పోటీ చేసినా ఓటర్లు ఆ పార్టీలను ఆదరించలేదని, లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది మా తొలి విజయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా, ఇలాంటి పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాలని ఇప్పటి నుంచి బీజేపీ- జేడీఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+