అత్తాకోడళ్లకు గొడవలు పెట్టిన కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ దాయాదులు, సీఎం ఇబ్రహీం !

బెంగళూరు/రామనగర: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. అయితే ఎన్నికల ప్రచారానికి ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో దెబ్బతో ప్రతి ఇంటిలో అత్తాకోడళ్లకు గొడవలు పెట్టినట్లు అయ్యిందని జేడీఎస్ పార్టీ సీనియర్ నేత సీఎం. ఇబ్రహీం వ్యంగంగా అన్నారు.

ఎన్నికల ప్రచారానికి తెరపడే రోజులు దగ్గర పడటంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ సీఎం కుమారస్వామికి మద్దతుగా చెన్నపట్టణలో రోడ్ షో నిర్వహించిన జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సీఎం ఇబ్రహీం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య మండిపడ్డారు.

 cmibrahim-

మేము అధికారంలోకి వచ్చిన వంటనే భజరంగదళ్ ను బ్యాన్ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ 2013 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసింది ?, అప్పుడు భజరంగ్ దళ్ గుర్తుకురాలేదా అని కాంగ్రెస్ పార్టీని సీఎం ఇబ్రహీం ప్రశ్నించారు. ప్రతి ఇంటికి రూ. 2 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని సీఎం ఇబ్రహీం గుర్తు చేశారు.

ప్రతి ఇంటిలో అత్తకు రూ. 2 వేలు ఇస్తారా, కోడలికి రూ. 2 వేలు ఇస్తారా, కాంగ్రెస్ తీరు చూస్తుంటే ప్రతి ఇంటిలో అత్తాకోడళ్లకు గొడవలు పెట్టేలా ఉన్నారని సీఎం ఇబ్రహీం తనదైన శైలిలో వ్యంగంగా అన్నారు. జేడీఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తిప్పించి మళ్లించి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోగా ప్రకటించుకుందని, వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక నానా తంటాలు పడుతోందని సీఎం ఇబ్రహీం ఆరోపించారు.

 cmibrahim-

జేడీఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేసినట్లే అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్నారని సీఎం ఇబ్రహీం మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ దాయాదులని, వారు ఎప్పటికైనా ఒక్కటి అవుతారని సీఎం ఇబ్రహీం ఆరోపించారు. జేడీఎస్ పార్టీ మాత్రమే కన్నడిగులు పెట్టిన పార్టీ అని, జేడీఎస్ కే ఓటు వెయ్యాలని సీఎం ఇబ్రహీం కన్నడిగులకు మనవి చేశారు.

కర్ణాటకలో ముస్లీంకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మాజీ జేడీఎస్ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ అని, హుబ్బళిలోని ఈద్గా మైదానం కోసం పోరాటం చేసింది కూడా దేవేగౌడ అని, కాంగ్రెస్ పార్టీ కాదని, హిజాబ్, హలాల్ నిషేధంపై పోరాటం చేసింది హెచ్ డీ, కుమారస్వామి అని సీఎం ఇబ్రహీం అన్నారు. ముస్లీం సోదరులు ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీ మాయలో పడి ఆ పార్టీకి ఓటు వెయ్యకూడదని జేడీఎస్ నాయకుడు సీఎం ఇబ్రహీం మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+