మైసూరు మైలారీ హోటల్ లో దోసెలు పోసిన ప్రియాంక మేడమ్, టేస్ట్ మాత్రం !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బిజీగా ఉన్నారు. రెండు రోజుల నుంచి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ మైలారీ హోటల్ లోని వంట గదిలోకి వెళ్లిన ప్రియాంక గాంధీ స్వయంగా దోసెలు పోసి అదే హోటల్ లో దోసెలు, ఇడ్లీలు తిన్నారు.
మంగళవారం మైసూరు జిల్లాలోని టీ, నరసీపురలో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రియాంక గాంధీ తరువాత రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం మైసూరులోని అగ్రహార ప్రాంతంలోని ప్రసిద్ది చెందిన మైలారీ హోటల్ ముందు ప్రియాంక గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ప్రత్యక్షం అయ్యారు.

చాలా ఏళ్ల నుంచి మైసూరులోని మైలారీ హోటల్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మైలారీ హోటల్ లో దోసెలు, ఇడ్లీలు చాలా ఫేమస్, మైలారీ హోటల్ లోకి వెళ్లిన ప్రియంక గాంధీ అక్కడ దోసెలు చేసే విధానం గురించి తెలుసుకున్నారు. తరువాత నేరుగా హోటల్ లోని వంట గదిలోకి వెళ్లిన ప్రియాంక గాంధీ ఆమె స్వయంగా దోసెలు పోశారు.
తరువాత అదే హోటల్ లో కుర్చున్న ప్రియాంక గాంధీ, డీకే. శివకుమార్, రణదీప్ సూర్జేవాల కడుపునిండా దోసెలు, ఇడ్లీలు ఆరగించారు. మైలారీ హోటల్ యాజమానులు, అక్కడ పని చేసే సిబ్బంది. అదే సమయంలో టిఫిన్ చెయ్యడానికి వెళ్లిన స్థానికులు ప్రియాంక గాంధీతో ఫోటోలు తీసుకుని ఫుల్ ఖుషీ అయిపోయారు.
Enjoyed making dosas with the legendary Myalri Hotel owners this morning….what a shining example of honest, hard work and enterprise.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 26, 2023
Thank you for your gracious hospitality.
The dosas were delicious too…can’t wait to bring my daughter to Mysuru to try them. pic.twitter.com/S260BMEHY7
మైసూరు నుంచి నేరుగా శృంగేరికి వెళ్లిన ప్రియాంక గాంధీ అక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు. మద్యాహ్నం బాళేహిన్నూరులోని కలారంగ క్రీడామైదానంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ కేంద్రంలోని, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాల మీద విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కన్నడిగులకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications