హంపశయ్య పై కాంగ్రెస్ పార్టీ..! అగమ్యగోచరంలో హస్తం నేతలు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు లోక్ సభ ఎన్నికల్లో పట్టుమని వంద సీట్లు కూడా రాకపోవడం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. దీంతో ఆ పార్టీ నాయకుల్లో సంక్షోభం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌ను అతలాకుతలం చేస్తోంది. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లతో భేటీలోనూ ఆయన ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పంజాబ్, ఝార్ఖండ్, అసోం పీసీసీ అధ్యక్షులు సునీల్ జాకర్, అజయ్ కుమార్, రిపున్ బోరాలు రాజీనామాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేసిన కాంగ్రెస్ 542 లోక్‌సభ స్థానాల్లో 52 మాత్రమే గెలవగలిగింది.

2014తో పోలిస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే పెరిగాయి. ఓటమికి బాధ్యతగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. పరాజయానికి సమష్టి బాధ్యత తీసుకుందామని సీనియర్లు నచ్చజెప్పినా రాజీనామాను ఆమోదించాల్సిందేనంటూ రాహుల్ పట్టుబడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు కొత్త సారథి రావాల్సిందేనని, అది కూడా తమ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి ఉండాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారని సమాచారం. రాహుల్ నిర్ణయం మార్చుకోకుంటే సోనియా, ప్రియాంకను పార్టీ అధ్యక్ష పదవికి నేతలు ప్రతిపాదిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications