Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిట్టింగ్ ఎంపీ మార్ఫింగ్ వీడియోలు వైరల్, సీన్ లోకి ప్రధాని మోదీ, మాజీ సీఎం, కాంగ్రెస్ టార్గెట్ !

కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఎన్నికల ఏజెంట్ ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ పెన్ డ్రైవ్ ఉదంతం బయటకు రావడంతో హాసన్ జిల్లా రాజకీయల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

జేడీఎస్, బీజేపీ కూటమి ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర తేజస్వి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. నవీన్ గౌడ తదితరులు ఈ మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేస్తున్నారని తేజస్వి తన ఫిర్యాదులో ఆరోపించారు. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో నవీన్ గౌడ తదితరులు వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసి హాసన్ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లకు పెన్ డ్రైవ్, సీడీ, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారని తేజస్వి ఆరోపించారు.

Congress party questioned former CM Kumaraswamy on Hasan sitting MP morphing videos
ప్రజ్వల్ రేవణ్ణకు ఓటు వేయకండి అంటూ ఓటర్లకు నవీన్ గౌడ తదితరులు చెబుతున్నారని, మా కూటమి నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెడకొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల విషయంపై కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ వ్యవహారం ఇప్పుడు హాసన్ జిల్లా దాటి రాష్ట్ర స్థాయిలో కలకలం రేపడంతో జోరుగా చర్చ జరుగుతోందని, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు అంటూ మాజీ సీఎం కుమారస్వామిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ వ్యవహారంలో మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ మాజీ సీఎం కుమారస్వామిని కాంగ్రెస్ ప్రశ్నించింది. పెన్ డ్రైవ్ నా జోబులో ఉందంటూ ఇంతకాలం చెబుతున్న కుమారస్వామి ఆ పెన్ డ్రైవ్ ఇదేనా ?, ఆ పెన్ డ్రైవ్ మీదేనా ?, హాసన్ జిల్లాలోని వీదివీదిలో చక్కర్లు కొడుతున్న ఆ పెన్ డ్రైవ్ ఇదేనా ? అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కుమారస్వామిని ప్రశ్నించింది.

కర్ణాటక మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మాజీ సీఎం కుమారస్వామి మీ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. మాజీ సీఎం కుమారస్వామితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మహిళ మంగళసూత్రాల వ్యవహారంలో నోరుపారేసుకున్న ప్రధాని రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది,

మహిళల మానం, మర్యాదలు తీస్తున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బీజేపీ ఎలా మద్దతు ఇస్తుందో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహిళలు, వారి మంగళసూత్రాల మీద మీకు గౌరవం ఉంటే హాసన్ జేడీఎస్, బీజేపీ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో జరిగిన ఈ వ్యవహారంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన మార్ఫింగ్ వీడియో బయటకు రావడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+