ఆ నలుగురు: గుల్బర్గా, బీదర్‌కు కాంగ్రెస్ ప్రత్యేక హెలికాప్టర్లు
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో క్షణక్షణానికి రాజకీయం మారుతోంది.ఈ తరుణంలో షాంగ్రీలా హోటల్ కు తమ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. మరో వైపు గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు రెండు ప్రత్యేక హెలిక్యాప్టర్లను కాంగ్రెస్ నాయకత్వం పంపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బెంగుళూరుకు రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ హెలిక్యాప్టర్లను ఏర్పాటు చేసింది. ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయాడు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అత్యవసరంగా బెంగుళూరుకు రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా ప్రయత్నాలు ప్రారంభించింది. బిజెపికి స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 105కు చేరుకొంది.

అయితే కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు గైరాజర్ అయ్యారు. అయితే గైరాజరయ్యారు. ఆనంద్ సింగ్, నాగేంద్ర, రాజశేఖర పాటిల్, భీమానాయర్ ఆమెర్ గౌడలు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే వీరు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షసమావేశానికి హజరుకాకపోవడం పట్ల ఆ పార్టీ నాయకత్వంలో ఆందోళన మొదలైంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలను బెంగుళూరుకు రప్పించేందుకుగాను ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రెండు హెలిక్యాప్టర్లను గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు పంపింది. ఈ ఎమ్మెల్యేలను ప్రత్యర్ధుల చేతులకు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొంటుంది.
మరో వైపు జెడి(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలంతా షాంగ్రీల్లా హోటల్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూడ అక్కడే ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే జెడి(ఎస్) ఎమ్మెల్యేలను కేరళలోని రిసార్ట్‌కు తరలించాలని ఆ పార్టీ నాయకత్వం తాజాగా నిర్ణయం తీసుకొంది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications