రాహుల్ పెళ్లి చూడండి: శివసేన, ప్రియాంకపై మేనక ఫైర్

Congress should get Rahul married instead of attacking Modi: Shiv Sena
ముంబై/న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వివాహం విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెసు పార్టీకి శివసేన చురకలు అంటించింది. నిత్యం మోడీ పెళ్లి గురించి మాట్లాడటం పక్కన పెట్టి.. మొదట రాహుల్ గాంధీకి పెళ్లి చేసే విషయం ఆలోచించాలని ఎద్దేవా చేశారు. శివసేన పత్రిక సామ్నాలో రాహుల్ పెళ్లి గురించి చూడాలని పేర్కొంది.

మరోవైపు, బిజెపి నేత వరుణ్ గాంధీపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు అతని తల్లి మేనకా గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశానికి సేవ చేసేందుకు ఎవరు సరైన దారిలో ప్రయాణిస్తున్నారో దేశ ప్రజలే నిర్ణయిస్తారని మేనక ఘాటుగానే బదులిచ్చారు.

అంతకుముందు, శనివారం తన సోదరుడు రాహుల్ నామినేషన్ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ వరుణ్ తమ కుటుంబానికి చెందినవాడేనని, అతను తన సోదరుడేనని అయితే అతను సరైన దారిలో ప్రయాణించడం లేదని, యువకులైన పిల్లలు దారి తప్పినప్పుడు వారిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని, తన సోదరుడు వరుణ్‌కు సరైన దారి చూపించాల్సిందిగా ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

అనంతరం జరిగిన ఓ సభలో కూడా ప్రియాంక మాట్లాడుతూ సరైన దారి చూపించే వ్యక్తులు వరుణ్‌కు అవసరమన్నారు. బిజెపి అభ్యర్థిగా వరుణ్ గాంధీ సుల్తాన్‌పూర్ నుంచే బరిలో ఉన్నారు. దీనిపై మేనకా గాంధీ తీవ్రంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+