రాహూల్ గాంధీ ర్యాలీ: గన్ కలకలం, ఏక్ నిరంజన్

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ పాల్గోననున్న ర్యాలీలో గన్ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి ర్యాలీలోకి గన్ తో ప్రవేశించడానికి ప్రయత్నించాడు.

అయితే ర్యాలీ ప్రవేశ ద్వారం దగ్గర భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అతని దగ్గర ఉన్న గన్ బయటపడింది. ఆ వ్యక్తిని పశ్చిమ చంపారన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతని పేరు, వివరాలు చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరించారు.

Congress vice president Rahul Gandhi’s rally in Bihar

రాహుల్ గాంధీ ఏక్ నిరంజన్......................!

బీహార్ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే షాక్ కు గురైయ్యింది. మిత్రపక్షాలు హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ర్యాలీలో తాము హాజరు కాలేమని నాయకులు చేతులు ఎత్తేశారు.

శనివారం పశ్చిమ చంపారన్ జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అన్ని ఎర్పాట్లు చేశారు. మిత్రపక్షాలు ఆర్జేడీ-జేడీయుకు సమాచారం ఇచ్చారు. మొదట అర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తాను ఈ ర్యాలీలో పాల్గోనడం లేదని చెప్పారు.

తరువాత బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ సైతం తాను ఈ ర్యాలీలో పాల్గోనడం లేదని కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ దెబ్బకు గిలిగిలలాడిన కాంగ్రెస్ ఎలాగైనా రాహుల్ గాంధీ ర్యాలీని సక్సస్ చెయ్యాలని జనసమీకరణలో తలమునకలైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+