వేలంటైన్స్ డే కానుకః రాహుల్‌ను ముద్దాడిన మహిళ
Recommended Video

అహ్మదాబాద్ః అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని గిప్ట్ అది. వేలంటైన్స్ డే సందర్భంగా ఓ మహిళ వేదికపైనే ఆయనను ముద్దాడింది. ప్రేమగా! గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని వల్సాడ్‌లో ఈ దృశ్యం కనిపించింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ ఉదయం కూడా ఆయన రాజస్థాన్ లోని అజ్మీర్, గుజరాత్ లోని వల్సాడ్‌లో జన్ ఆక్రోశ్ ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అజ్మీర్‌లో సభ ముగించుకుని నేరుగా వల్సాడ్‌కు చేరుకున్నారు.
అక్కడ పార్టీ రాష్ట్రశాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అజ్మీర్ నుంచి వల్సాడ్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ తొలుత.. పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశం అయ్యారు. అనంతరం.. స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. వేదిక ఎక్కిన రాహుల్ గాంధీ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం వేదికపై వేసిన కుర్చీలో కూర్చున్నారు. ఆ వెంటనే కొందరు మహిళా నాయకులు రాహుల్ గాంధీ వద్దకు వచ్చారు. వారి రాకను గమనించిన రాహుల్ గాంధీ కుర్చీలో నుంచి లేచి, నిల్చున్నారు.

అంతలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ నాయకురాలు రాహుల్ గాంధీ చెంపపై ముద్దు పెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో తొలుత తడబడ్డ రాహుల్ వెంటనే తేరుకుని చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు. ముద్దాడిన మహిళ వెంటనే వచ్చిన ఇతరులు రాహుల్ కు శాలువా కప్పి, గౌరవించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications