కవలలను కాపాడిన చెన్నై అపోలో... చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అభినందన (ఫోటోలు)
చెన్నై: చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు మరో చరిత్రను సృష్టించారు. ప్రపంచంలో మొదటిసారి థొరాకో ఒంఫలోపగస్‌తో బాధపడుతున్న అవిభక్త కవలలను విజయవంతంగా వేరుచేయగలిగారు. నవంబర్ 11న సుమారు పన్నెండు విభాగాలకు చెందిన 50 మంది వైద్యులు ఏకంగా 11 గంటల పాటు చేసిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ఆసుపత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
పుట్టుకతోనే ఛాతి నుంచి ఉదరం దాకా దేహాలు కలిసిపోవడంతోపాటు ఒకే హృదయాన్ని పంచుకొని పుట్టే సమస్యను వైద్యపరిభాషలో థొరాకో ఒంఫలోపగస్‌గా చెబుతారు. అబ్రియానా, ఆండ్రియానా అనే టాంజానియా కవలలు చికిత్స నిమిత్తం గత ఆగస్టులో తమ ఆసుపత్రిలో చేరారనీ, వీరికి తాము చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందనీ వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ వెంకట శ్రీపతి వెల్లడించారు.
ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలకు తక్కువ ధరలో ఇండియా హెల్త్ కేర్ రంగం వైద్య సహాయాన్ని అందిస్తుదన్నారు. చిన్నారులను కాపాడిన వైద్యుల బృందాన్ని అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అభినందించారు.

కవలలను కాపాడిన చెన్నై అపోలో
చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో ఆపరేషన్‌కు ముందు చిన్నారులు అబ్రియానా, ఆండ్రియానా. ప్రపంచంలో మొదటిసారి ఈ అవిభక్త కవలలను విజయవంతంగా వేరుచేయగలిగారు.

కవలలను కాపాడిన చెన్నై అపోలో
నవంబర్ 11న సుమారు పన్నెండు విభాగాలకు చెందిన 50 మంది వైద్యులు ఏకంగా 11 గంటల పాటు చేసిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ఆసుపత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

కవలలను కాపాడిన చెన్నై అపోలో
పుట్టుకతోనే ఛాతి నుంచి ఉదరం దాకా దేహాలు కలిసిపోవడంతోపాటు ఒకే హృదయాన్ని పంచుకొని పుట్టే సమస్యను వైద్యపరిభాషలో థొరాకో ఒంఫలోపగస్‌గా చెబుతారు.

కవలలను కాపాడిన చెన్నై అపోలో
అబ్రియానా, ఆండ్రియానా అనే టాంజానియా కవలలు చికిత్స నిమిత్తం గత ఆగస్టులో తమ ఆసుపత్రిలో చేరారనీ, వీరికి తాము చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందనీ వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ వెంకట శ్రీపతి వెల్లడించారు.

కవలలను కాపాడిన చెన్నై అపోలో
ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలకు తక్కువ ధరలో ఇండియా హెల్త్ కేర్ రంగం వైద్య సహాయాన్ని అందిస్తుదన్నారు. చిన్నారులను కాపాడిన వైద్యుల బృందాన్ని అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అభినందించారు.












Click it and Unblock the Notifications