షాకింగ్: తుపాకీ గురిపెట్టి మహిళతో డ్యాన్స్ (ఫోటో)

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీసు ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించాడు. రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌కు చెందిన శైలేంద్ర శుక్లా అనే పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో తుపాకీతో బెదిరించి ఓ మహిళ చేత డ్యాన్స్ చేయించాడు. అంతేకాక, ఆమె మీద డబ్బులు వెదజల్లాడు.

ఈ వ్యవహారాన్ని ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఇది బయటకు వచ్చింది. దీనిని పై అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. షాజహాన్‌పూర్ ఎస్సై కానిస్టేబుల్ శైలంద్రను సస్పెండ్ చేశారు.

 Constable suspended for forcing dancer to perform at gunpoint in UP

సదరు కానిస్టేబుల్ దాదాపు గంట పాటు ఆమె చేత నృత్యం చేయించాడు. ఆమె పైన 30,000 రూపాయల వరకు వెదజల్లాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఓ కల్చరల్ ఫంక్షన్ జరుగుతుండగా.. సదరు కానిస్టేబుల్ హఠాత్తుగా అందులోకి వెళ్లాడు. స్టేజ్ పైకి ఎక్కాడు.

స్టేజ్ పైన ఉన్న డ్యాన్సర్ తలకు లోడ్ అయిన ఉన్న తన తుపాకీని గురి పెట్టాడు. ఆమెతో అదే పనిగా నృత్యం చేయించాడు. నృత్యం చేస్తున్న ఆమె తనకు అలసట రావడంతో.. ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన తుపాకీతో బెదిరించాడు.

ఆ సమయంలో శుక్లా తన వద్ద ఉన్న రూ.100, రూ.500 నోట్లను ఆమె పైకి వెదజల్లాడు. ఈ సంఘటనకు పలువురు చూస్తుండగానే జరిగింది. అయితే, తాగిన మత్తులో ఉన్న ఆ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ ఉండటం, బెదిరించడంతో ఎవరు ముందుకు రాలేకపోయినట్లుగా కనిపిస్తోంది.

కానిస్టేబుల్ ఫుల్లుగా తాగి ఉన్నాడని, డ్యాన్సర్‌ను, ఆడియన్స్‌ను బెదిరించాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ కానిస్టేబుల్ తీరుకు డ్యాన్సర్ భయకంపితురాలైందని చెబుతున్నారు. ఆమె అలసిపోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం జరిగిందని, అయితే ఆయన తనను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో ఆమె నాట్యం ఆపలేదని చెబుతున్నారు.

ఈ విషయాన్ని వీడియోలో చిత్రీకరించిన కొందరు షాజహాన్ పుర్ సూపరింటెండెంట్ రమేష్ చంద్ర సాహు దృష్టికి తీసుకు వెళ్లారు. ఉన్నతాధికారులు శుక్లాను మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ సంఘటన తెలియగానే శుక్లాను సస్పెండ్ చేశామని, దీని పైన విచారణ జరుపుతున్నామని ఎస్పీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+