మహిళా మంత్రి కాళ్లు పట్టుకున్న కాంట్రాక్టర్, ఐనా తగ్గలేదు (వీడియో)

భోపాల్: ఓ మహిళా మంత్రిని శాంతింప చేసేందుకు ఓ కాంట్రాక్టర్ కాళ్ల పైన పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ పనులను ఎత్తిచూపిన మహిళా మంత్రి కాళ్లను కాంట్రాక్టర్ పట్టుకోవడం కలకలం రేపుతోంది.

Contractor prostrates at feet of 'unhappy' MP Yashodhara Raje Scindia

శివపురిలో నిర్మించిన 120 పడకల ఐటీఐ హాస్టల్ భవనాన్ని ప్రారంభించేందుకు మధ్యప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి యశోధర రాజే సింధియా వెళ్లారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె హాస్టల్లో అంతా తిరిగి చూశారు. ఈ సందర్భంగా హాస్టల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్మాణం నాసిరకంగా ఉందని గుర్తించారు.

ప్రభుత్వం కేటాయించిన నిధులకు తగ్గ పనులు జరగలేదని మండిపడ్డారు. ఈ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేసి, ప్రారంభోత్సవం నిర్వహించాలని సూచించారు. దీంతో హాస్టల్ నిర్మించిన కాంట్రాక్టర్ ఆమె కాళ్లు పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె శాంతించలేదు. నిధులకు తగ్గ పనులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మంజూరు చేసిన నిధులకు అనుగుణంగా హాస్టల్ నిర్మించకుంటే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+