వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్ మీద దాడి చేసిన సింగర్ మీకా సింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చెప్పినట్లు వినలేదని ఆగ్రహించిన ప్రముఖ వివాదాస్పద సింగర్ మీకా సింగ్ డాక్టర్ ను పట్టుకుని చితకబాదాడు. పోలీసులు మీకా సింగ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీకా సింగ్ ఈ వివాదం నుండి బయటపడాలంటే దెబ్బలు తిన్న డాక్టర్ కరుణ చూపించాలి.

ఢిల్లీ ఆప్తామాలజికల్ సొసైటి నిర్వహకులు ఢిల్లీ పుసా ఇన్సిట్యూట్ మేలా గ్రౌండ్స్ లో మూడు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ప్రముఖ గాయకుడు మీకా సింగ్ తో కచేరి ఏర్పాటు చేశారు.

ఇదే సదస్సులో మీకా సింగ్ శనివారం రాత్రి కచేరి జరిగింది. ఆ సందర్బంలో ఆడియన్స్ ను స్టేజ్ మీదకు పిలిచిన మీకా సింగ్ తాను చెప్పినట్లు చెయ్యాలని చెబుతున్నాడు. అదే సమయంలో అంబేద్కర్ ఆసుపత్రిలో కంటి వైద్యుడిగా పని చేస్తున్న శ్రీకాంత్ అనే డాక్టర్ ను స్టేజ్ మీదకు పిలిచారు.

Controversial singer Mika Singh has courted fresh troubles for himself after he slapped a doctor

స్టేజ్ మీదకు వెళ్లిన శ్రీకాంత్ ను ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని మీకా సింగ్ చెప్పాడు. అయితే మీకా సింగ్ చెప్పినట్లు డాక్టర్ శ్రీకాంత్ చెయ్యలేకపోయారు. ఆ సందర్బంలో సహనం కొల్పోయిన మీకా సింగ్ శ్రీకాంత్ చెంపలను చెళ్లుమనిపించారు.

తరువాత అక్కడే ఉన్న బౌన్సర్ లకు శ్రీకాంత్ ను అప్పగించారు. బౌన్సర్ లు దాడి చెయ్యడంతో డాక్టర్ శ్రీకాంత్ కు గాయాలు అయ్యాయి. శ్రీకాంత్ ఎడమ చెవికి తీవ్రగాయాలైనాయని, అతని శరరీంలో చాల చోట్ల దెబ్బలు తగిలాయని పోలీసులు అన్నారు. మీకా సింగ్ డాక్టర్ మీద దాడి చేసే క్లిప్పింగ్ లు ఇంటర్నెట్ లో దర్శనం ఇస్తున్నాయి.

English summary
The Mika Singh Live-in-concert was co-ordinated by the Delhi Ophthalmological Society as a part of the three-day conference
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X