The Kerala Story అంతకు మించిన బిగ్ స్టోరీ..ఆపరేషన్ ఢిల్లీ..!
The Kerala Story:ఈ రోజుల్లో ఏ చిత్రం రిలీజైనా కొన్ని రోజులకు లేదా కొన్ని నెలలకు ఓటీటీపై ప్రత్యక్షం అవుతోంది. ఓటీటీలు రావడంతో ఇటు ప్రేక్షకులకు అటు నిర్మాతలకు అడ్వాంటేజ్‌గా మారాయి. థియేటర్లలో ఒక మూవీని చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ప్రతి చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫాంపైకి రావాల్సిందే. అయితే ఒక చిత్రం మాత్రం ఓటీటీ సంస్థలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆ చిత్రమే కేరళ స్టోరీ.
బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన చిత్రం కేరళ స్టోరీ. ఏ రకంగా అయితే ఈ సినిమా భారీ హిట్ కొట్టిందో అదే రకంగా వివాదాలు కూడా చుట్టుముట్టాయి.అదాశర్మ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ డైరెక్ట్ చేశారు.గత నెల మే 5న విడుదలైన ఈ చిత్రం కాంట్రవర్శియల్ మూవీగా నిలిచింది. మతమార్పిడులు అనే సున్నితమైన అంశాన్ని టచ్ చేయడంతో వివాదాలు మొదలయ్యాయి.దీంతో పాటు ఐసిస్, జీహాద్ అంశాలను కూడా ముట్టడంతో వివాదాలు పీక్ స్టేజెస్‌కు చేరుకున్నాయి.

ది కేరళ స్టోరీ చిత్రం విడుదలై నెలన్నర రోజులు కావొస్తున్నప్పటికీ ఈ సినిమాను తీసుకునేందుకు ఏ ఓటీటీ ప్లాట్ ఫాం ముందుకు రాకపోవడంతో చిత్రబృందం ఆందోళన చెందుతోంది. అయితే ఇండస్ట్రీ అంతా ఏకమై తమ చిత్రం ది కేరళ స్టోరీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రాకుండా అడ్డుకుంటోందని డైరెక్టర్ సుదీప్తో సేన్ ఆరోపించారు. ప్రస్తుతం ది కేరళ స్టోరీ చిత్రం కోసం ఓటీటీ వేటలో ఉంది చిత్ర బృందం. మొత్తం సినిమా ఇండస్ట్రీ తమను శతృవుగా చూస్తూ శిక్షిస్తోందనే ఘాటు వ్యాఖ్యలు చేశారు సుదీప్తో సేన్. తమ విజయాన్ని చూసి ఓర్వలేక ఇండస్ట్రీలోని ఓ వర్గం ఇదంతా చేస్తోందన్నారు.

కేరళ స్టోరీ చిత్రం కేరళకు చెందిన ఓ హిందూ యువతి చుట్టూ తిరుగుతుంది. హిందూ యువతి పాత్రలో అదాశర్మ నటించింది. ఇస్లాం మతం బలవంతంగా స్వీకరించి సిరియాకు ఆ యువతిని పంపడం జరుగుతుంది.అక్కడే ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరాల్సి వస్తుంది.అక్కడ ఆ యువతి (అదాశర్మ) అనుభవించిన చిత్రహింస ఎలా అధిగమించిందనే దానిపై కథ నడుస్తుంది.సుదీప్తోసేన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ది కేరళ స్టోరీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదాల ఊబిలో చిక్కుకుంది.












Click it and Unblock the Notifications