మహిళాఎస్సైతో షారూక్ ఖాన్ డ్యాన్స్, వివాదం (ఫోటో)

కోల్‌కతా: షారుక్ ఖాన్ యూనిఫాంలో ఉన్న ఓ మహిళా పోలీసుతో కలిసి డ్యాన్స్ చేయడం వివాదానికి దారి తీసింది. షారూక్ ఖాన్ పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్. షారూక్ యూనిఫాంలో ఉన్న మహిళా పోలీసుతో కలిసి డ్యాన్స్ చేయడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి.

షారూక్ ఖాన్ శనివారం కోల్‌కతా పోలీస్ వార్షిక సాంస్కృతి వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్ సంపాహల్దార్‌ను రెండు చేతులతో పైకెత్తుకుని డ్యాన్స్ చేశాడు. తన బ్లాక్ బస్టర్ మూవీ జబ్ తక్ హై జాన్‌లోని ఓ హిట్ గీతానికి షారూఖ్ ఈ మహిళా పోలీసు అధికారి కలిసి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు.

దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. సినిమా తారలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం మమతా బెనర్జీకి చురకలంటించారు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారితో డ్యాన్సులేయించడం ద్వారా సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి దుయ్యబట్టారు. ఈ చర్య సిగ్గుచేటన్నారు.

 Controversy erupts over Shahrukh Khan dancing with woman cop in uniform

బీజేపీ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. అసలు మమతా బెనర్జీ రాజకీయాల్లోకి రావడమే పెను తప్పిదమన్నారు. ప్రతి కార్యక్రమానికి మమత ఫిలిం స్టార్లను పిలవడం చూస్తుంటే, ఆమె పొరబాటున రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారనిపిస్తోందని, ఈ విషయాన్ని ఆమె త్వరలోనే అర్థం చేసుకుని పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారని, బెంగాల్ ప్రజలకు అదే మేలన్నారు. మాజీ పోలీసు అధికారులు యూనిఫాంతో డ్యాన్స్ చేయడాన్ని తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+