Condition: కుక్కర్ బాంబ్ స్కెచ్ రివర్స్, పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేము, 40 శాతం, పోలీస్ కమీషనర్ !
మంగళూరు/బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు సిటీలో ఆటో జరిగిన పేలుడులో పోలీసులకు కొన్ని సాక్షాలు చిక్కాయి. నిందితుడు షారిఖ్ కుక్కర్ బాంబుతో నిలబడి మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటోలు పోలీసుల చేతికిచిక్కాయి. షారిక్ బాంబు పేలుడుకు స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. కుక్కర్ బాంబు పేలుడుతో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు షారిఖ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఇప్పుడు అతని గురించి పూర్తి వివరాలు వెళ్లడించలేమని పోలీసు అధికారులు అంటున్నారు. కుక్కర్ బాంబు పేలుడులో తీవ్రగాయాలైన షారిఖ్ కు 40 శాతం గాయాలైనాయని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ అంటున్నారు.

కుక్కర్ బాంబ్ స్కెచ్
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థ హళ్లిలో నివాసం ఉంటున్న మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో అద్దె ఆటోలో షారిఖ్ కుక్కర్ బాంబు తీసుకు వెలుతున్న సమయంలో అది పేలిపోయింది.

ఏదో అనుకుంటే ఏదో జరిగింది ?
షారిఖ్ ఏదో ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని కుక్కర్ బాంబుతో దాడి చెయ్యాలని అనుకున్నాడని, అయితే ఆ ప్రాంతానికి వెళ్లకముందే ఆ కుక్కర్ బాంబ్ ఆలోలో పేలిపోయిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో జరిగిన కుక్కర్ బాంబు పేలుడులో అనుమానిత ఉగ్రవాది షారిఖ్ తో పాటు ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వాడి విషయం చెప్పలేము
మంగళవారం మంగళూరులోని ఫాదర్ ముల్లాస్ర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్న మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఎన్. శశికుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కుక్కర్ బాంబు దాడిలో తీవ్రగాయాలైన అనుమానిత ఉగ్రవాది షారిఖ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు కచ్చితమైన క్లారిటీ ఇవ్వలేమని అన్నారు.

డాక్టర్లు సర్టిఫికెట్ ఇవ్వాలి
కుక్కర్ బాంబు దాడిలో తీవ్రగాయాలైన అనుమానిత ఉగ్రవాది షారిఖ్ ఆరోగ్యం కుదటపడిందని ఆసుపత్రి డాక్టర్లు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని, అతను కోలుకున్నాడని డాక్టర్లు లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన తరువాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఎన్. శశికుమార్ మీడియాకు చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications