bomb: హోమ్ స్టేలో మహిళలతో షారిక్ కు ఏం పని ?, మూడు రోజులు ?, కొడుగులో కోలాటం వేసి, రాత్రి ?
బెంగళూరు/మంగళూరు/కొడుగు: మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసులో అరెస్టు అయిన మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ రసికుడు అని వెలుగు చూసింది. మంగళూరు సిటీలో ఏదో ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్న షారిఖ్ స్కెచ్ చివరి నిమిషంలో రివర్స్ అయ్యింది. అయితే అనుమానిత ఉగ్రవాది షారిఖ్ గురించి కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడుకు ముందు షారిఖ్ ఇద్దరు మహిళలతో కలసి ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలోని హోమ్ స్టేలో ఎంజాయ్ చేశాడని వెలుగు చూసింది. కుక్కర్ బాంబు పేలుడులో షారిఖ్ కు తీవ్రగాయాలు కావడంతో మేడమ్ లు ఇద్దరు, వారి అనుచరులు మాయం అయ్యారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

కుక్కర్ బాంబుతో ?
కర్ణాటకలోని మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసులో అరెస్టు అయిన మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ గురించి పోలీసులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. మోహమ్మద్ షారిఖ్ కుక్కర్ బాంబు పేలుడు జరపకముందు ఎక్కడెక్కడ తిరిగాడు ?, ఎవరెవరితో కలిశాడు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.

ఆటోలో ఏం జరిగింది ?
మంగళూరు సిటీలో ఏదో ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్న షారిఖ్ స్కెచ్ చివరి నిమిషంలో రివర్స్ అయ్యింది. ఆటోలో వెలుతున్న సమయంలోనే ఆటోలో కుక్కర్ బాంబు పేలిపోయింది. ఆసందర్బంలో అనుమానిత ఉగ్రవాది షారిఖ్ తో పాటు ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలైనాయి. ఇద్దరు కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

లేడీస్ తో రొమాన్స్
మంగళూరు కుక్కర్ బాంబు పేల్చడానికి ముందు అనుమానిత ఉగ్రవాది షారిఖ్ కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని పోన్నంపేట్ తాలుకా సమీపంలోని నేచర్ క్యాంప్ లో పాల్గొన్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. నేచర్ క్యాంప్ హోమ్ స్టే లో ఇద్దరు మహిళలతో పాటు కొందరు వ్యక్తులతో షారిఖ్ బసచేశాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మూడు రోజులు మహిళలతో ఏం చేశాడు ?
2022 మే నెల 27,28,29 తేదీల్లో షారిఖ్ కొడుగు సమీపంలోని నేచర్ క్యాంప్ హోమ్ స్టే లో ఇద్దరు మహిళలతో కలసి ఉన్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు మహిళలతో పాటు కొందరు వ్యక్తులు షారీఖ్ వెంట వెళ్లారని వెలుగు చూసింది. అయితే ఆ మూడు రోజులు షారిఖ్ అక్కడ ఏం చేశాడు ? అని విషయం గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

షారిక్ కు ట్రక్కింగ్ అవసరమా ?
కొడుగు జిల్లాలోని హోమ్ స్టేలో ఉన్న షారిఖ్ ఒక్కరోజు ట్రక్కింగ్ వెళ్లాడని వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన రాజన్ అనే వ్యక్తి షారిఖ్ కు ట్రిక్కింగ్ లో శిక్షణ ఇచ్చాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. నేచర్ క్యాంప్ హోమ్ స్టే యజమాని అక్రమంగా అనుమంతి లేకుండా హోమ్ స్టే నిర్వహిస్తున్నాడని అధికారుల విచారణలో బయటకు వచ్చింది. నేచర్ క్యాంప్ హోమ్ స్టే యజమానితో పాటు ట్రక్కింగ్ కు శిక్షణ ఇచ్చిన రాజన్ ను మంగళూరులో విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications