Edible Oil: తగ్గిన వంట నూనె ధరలు.. దిగుమతి పెరగడమే కారణమా..!

దేశంలు వంట నూనె ధరలు తగ్గుతోన్నాయి. దిగుమతి పెరగడంతోనే ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌తో ముగిసిన ప్రస్తుత చమురు సీజన్‌లోని మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశ ఆహార చమురు దిగుమతులు 25.04 శాతం పెరిగాయి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రస్తుత సీజన్‌లో నవంబర్-జూలై కాలంలో 121.22 లక్షల టన్నుల (lt) ఎడిబుల్ ఆయిల్ దిగుమతి అయింది.

ప్రస్తుత చమురు సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిని పరిశీలిస్తే, దిగుమతులు కనిపించడంలో ఆశ్చర్యం లేదని SEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా అన్నారు. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. 2022-23లో తొలి తొమ్మిది నెలల సీజన్‌లో (నవంబర్‌-అక్టోబర్‌) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Cooking oil prices in the country have come down due to increase in imports

అయితే నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి.జూలైలో వంట నూనెల దిగుమతులు 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయినట్లు తెలుస్తోంది. దిగుమతి భారీగా పెరగడంతో ధరలు తగ్గాయి. ధరలు తగ్గడంతో డిమాండ్ కూడా పెరిగినట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో 45 రోజులకు సరిపడ వంట నూనె నిల్వలు ఉన్నట్లు వివరించింది. ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్ కు భారీగా పామాయిల్ దిగుమతి అవుతోందని తెలిపింది. అర్జెంటీనా నుంచి సోయాబీన్ నూనే, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనే భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. గత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల వంట నూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+