లక్ష్యం ఇదీ: తక్కువ ధరకే 'కూల్ ప్యాడ్ నోట్ 3'
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో 'కూల్ ప్యాడ్ నోట్ 3' ఓ సంచలనం. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ తయారీదారు కూల్ ప్యాడ్ నోట్ 3 విక్రయానికి పెట్టిన రోజునే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అమెజాన్ లో 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. దీంతో కూల్ ప్యాడ్ కంపెనీ కన్ను భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై పడింది.
ఇందులో భాగంగా భారత్‌లో అత్యతం పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో స్మార్ట్ మార్కెట్‌లో 5 నుంచి 7 శాతం షేర్‌ను సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో తయారు చేసిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ 'కూల్ ప్యాడ్ నోట్ 3'. వీడియోకాన్ భాగస్వామ్యంతో 'కూల్ ప్యాడ్ నోట్ 3'ని భారత్‌లో తయారు చేశారు.

'కూల్ ప్యాడ్ నోట్ 3'లో అన్ని ఫీచర్స్ లాగే అతి తక్కువ బరువును కలిగి ఉండేలా 'కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్' ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కామర్స్ దిగ్గజ వెబ్ సైట్ అమెజాన్‌లో 'కూల్ ప్యాడ్ నోట్ 3' అందుబాటులో ఉంచారు. దీని ఖరీదు రూ. 8999 మాత్రమే. కూల్ ప్యాడ్ ఇండియా సీఈఓ సయ్యద్ తజుద్దిన్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయలు మనసుని దోచుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ని దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మేడిన్ ఇండియా ఉత్పత్తుల ద్వారా ఉత్తరప్రదేశ్ మార్కెట్లోకి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూల్ ప్యాడ్ నోట్ 3, కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్‌ల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో 5-7 శాతం షేర్‌ను సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వినియోగదారుల కోసం కూల్ ప్యాడ్ నోట్ 3 అందుబాటులో ఉంచామని చెప్పిన ఆయన అమెజాన్.ఇన్‌లో కొత్తగా తయారు చేసిన కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్‌ను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలోనే కూల్ ప్యాడ్‌కు చెందిన అన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామని అన్నారు.
కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ధర రూ.6.999, 360 డిగ్రీల పింగర్ రోటేషన్, 4జీ ఎల్ టీఈను సపోర్ట్ చేస్తుంది.
కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ఫీచర్లు:
3 జీబీ ర్యామ్
5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే
16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ
13 ఎంపీ కెమెరా
2,500 ఏఎంపీ బ్యాటరీ
ఇక కూల్ ప్యాడ్ కంపెనీ విషయానికి వస్తే 1993లో సంస్థను ప్రారంభించారు. 2004 డిసెంబర్‌లో హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయింది. చైనా ప్రధాన కేంద్రంగా స్మార్ట్ ఫోన్లు, మొబైల్ డేటా ఫ్లాట్‌ఫామ్స్‌లకు సంబంధించిన సేవలను అందిస్తోంది.












Click it and Unblock the Notifications