టెన్త్ గర్ల్‌పై ఫ్రెండ్స్‌తో కల్సి కానిస్టేబుల్ రేప్, వీడియో తీసి..

Cop, friends allegedly gang rape Class 10 student
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ పోలీసు కానిస్టేబుల్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఓ విద్యార్థినిపై సామాహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్‌లో జరిగింది. డిసెంబర్ నాలుగో తేదిన బాలిక ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తుండగా పొరుగింట్లో ఉండే కరణ్ సమీపంలోని ఓ గదికి తీసుకు వెళ్లాడు.

అక్కడ కానిస్టేబుల్ నితిన్, కేశవ్‌లతో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార ఘటనను వీడియో తీసిన నితిన్.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడని విద్యార్థిని పోలీసులకు తెలిపింది.

విద్యార్థిని తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసిన వారు వీడియోను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి ఆ ముగ్గురు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, వైద్య పరీక్షలు చేయించామని, నివేదిక కోసం చూస్తున్నామని పోలీసులు చెప్పారు. కానిస్టేబుల్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+