యువతిపై లైంగిక వేధింపులు: హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

Cop held for molesting student in Delhi
న్యూఢిల్లీ: ప్రజలకు, మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని లోధి కాలనీలో జరిగింది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ అయిన నరేంద్ర కుమార్ భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, సోమవారం విధులు ముగించుకున్న తర్వాత తన స్నేహితులతో మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో అటువైపుగా వెళుతున్న 23ఏళ్ల యువతిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించాడు.

ఆ యువతి అభ్యంతరం తెలపడంతో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడి చేరుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు నరేంద్ర కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

కాగా, మరో ఘటనలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డిఫెన్స్ మినిస్ట్రీలో జాయిట్ డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి పక్కనే ఉంటున్న మైనర్ బాలికపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+