బెంగుళూరులో హైటెక్ సెక్స్ రాకెట్: నడుపుతున్నది పోలీస్ అధికారే!..
తాజాగా మైకో లేఔట్ లోని ఓ ఇండిపెండెంట్ హౌజ్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ వ్యభిచారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.
బెంగుళూరు: పైకి ఆయనో పోలీసు, సమాజానికి రక్షణగా ఉండాల్సినవాడు. కానీ లోపల తరచి చూస్తే చీడపురుగు వ్యక్తిత్వం. పోలీస్ అధికారిగా పనిచేస్తూనే 'సెక్స్' రాకెట్ నడిపిస్తున్న ఘనుడు. అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా!, నిజం బయటపడటంతో.. తాను పనిచేసిన జైల్లోనే ఇప్పుడు జైలు ఊచలు లెక్కలు పెడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్ లో కరిబసప్ప హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పేరుకు పోలీసే కానీ చేసేది మాత్రం అసాంఘిక కార్యకలాపాలు. ఇద్దరు వ్యక్తుల సహకారంతో ఓ హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. తాజాగా మైకో లేఔట్ లోని ఓ ఇండిపెండెంట్ హౌజ్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ వ్యభిచారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.

విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేశారు. దాడుల్లో ముగ్గురు యువతులు పట్టుబట్టారు. స్వైపింగ్ మెషిన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెనుక నుండి డీల్ చేస్తున్నది హెడ్ కానిస్టేబుల్ కరిబసప్పనే అని గుర్తించారు. దీంతో అతన్ని విధుల నుంచి తప్పించనున్నట్లు పోలీసులు తెలిపారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications