ఘోరం: 3వారాలపాటు తల్లీ, కూతురుపై ఎస్ఐ కొడుకు రేప్, వీడియో తీసి..

Subscribe to Oneindia Telugu

గురుగ్రామ్: దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మనేసర్‌లో ఇటీవల ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆమె 8 నెలల కుమారుడిని రోడ్డుపై విసిరేసిన ఘటనను మర్చిపోకముందే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ఎస్ఐ కుమారుడు మూడు వారాలపాటు ఓ మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బెదిరింపులకు గురిచేశాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు, ఆమె 15ఏళ్ల కుమార్తెపై మూడు వారాలపాటు అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కొడుకు ఆశిష్ కుమార్ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యాచారం చేస్తుండగా తీసిన వీడియోలను బయటపెడతానని బెదిరించి వారిపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

rape

నిందితుడి నుంచి అటువంటి పది వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ వీడియోలన్నీ బాధిత మహిళ (35), తన కుమార్తె, కుమారుడు (11)తో కలిసి ఉంటున్న ఇంట్లో తీసినవేనని వివరించారు.

బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆశిష్‌ బాధిత మహిళ ఇంట్లో ఉండగా శుక్రవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుడిు ఆశిష్ కుమార్‌పై 376, 506, ఐపీసీ 4, 12 పోస్కో చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Just after three men, accused of raping a 19-year-old woman and killing her baby girl in Manesar, are put behind bars comes another shocker from Gurgaon.
Please Wait while comments are loading...