మహిళా పోలీస్ ఒళ్లో మగ పోలీస్: వీడియో హల్‌చల్

శ్రీనగర్: మహిళా పోలీస్, మగ పోలీస్ పోలీస్ స్టేషన్‌లో వెకిలి చేష్టలు చేయడంతో వారు సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఓ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా పోలీసు ఒళ్లో కూర్చున్నాడు. ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. సదరు మగ పోలీస్ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒడిలో కూర్చున్నాడు.

Cop seen in pictures sitting on woman SPO’s lap; suspended

కూర్చున్న పోలీస్ జకీర్ హుస్సేన్. అతను హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ ఫోటో ఇంటర్నెట్లో జోరుగా షేర్ అవుతోంది. మహిళా పోలీసు కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె ఒడిలో అతను కూర్చున్నాడు. మహిళా స్పెషల్ ఆఫీసర్ పైన విచారణకు ఆదేశించారు. కాగా, అతను కూర్చున్నప్పుడు ఆ మహిళా పోలీస్ నవ్వుతూ కనిపించారు.

ఈ విషయమై రాజౌరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ... సస్పెండైన పోలీస్ పైన విచారణకు ఆదేశించామని చెప్పారు. మహిళా ఎస్పీవో పోలీస్ పైన కూడా విచారణకు అదేశించామన్నారు. కాగా, ఈ ఫోటోలు గత ఆగస్టు నెలలో తీసి ఉంటారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+