ఫేస్‌బుక్ పరిచయం: అమెరికన్ యువతిపై నైజీరియన్ రేప్

గుర్గావ్: అమెరికాకు చెందిన ఓ 17ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు ఓ నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు. ఘటన దేశ రాజధానికి సమీపంలోని గుర్గావ్‌లో చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఎఫ్ఎఫ్‌సిఓ చౌక్ వద్ద నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు డేవిడ్ ఉజోర్మా(22) వద్ద నుంచి దక్షిణాఫ్రికాకు సంబంధించిన నకిలీ పాస్‌పోర్టును, నైజీరియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఓ ఐ10 కారు, రూ. 2వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ ద్వారా నిందితుడు బాధిత యువతికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఢిల్లీలో ఓసారి కలిశారు. మార్చి 16న మరోసారి కలిశారు. ఆమెను సెక్టార్-38లోని ఓ గెస్ట్ హైజ్‌కి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు డేవిడ్.

 Cops arrest Nigerian for raping US national in Gurgaon

కాగా, బాధిత యువతి ఈ దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే ఆమెకు తీవ్ర అనారోగ్యం చేయడంతో ఆమె తల్లి ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, యువతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది.

దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు డేవిడ్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఓ ఐటి కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోందని, బాధితురాలు గత 9 నెలలుగా గుర్గావ్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు యువతిని గెస్ట్‌హౌజ్‌కి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+