‘ఫేక్’భర్తగా నటించమంటే ఆడుకున్నాడు
పూణే: నమ్మిన ప్రాణస్నేహితుడిని నకిలీ భర్తగా నటించమంటే అతడు ఆమె జీవితంతో ఆడుకున్నాడు. వీలు చిక్కినప్పుడు ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం మేరకు ముంబైకి చెందిన 22 ఏళ్ల బాధితురాలు పూణేలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నది. ఆమెకు పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి చేసుకోవడం యువతికి ఇష్టం లేదు.
తనకు పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారని ఆమె స్నేహితులకు చెప్పింది. ఎలాగైనా పెళ్లి జరగకుండా చూడాలని స్నేహితులకు చెప్పింది. ఆ యువతి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఓ యువకుడు నీకు పెళ్లి (ఫేక్) అయ్యిందని ఇంట్లో చెప్పాలని సలహా ఇచ్చాడు.

అందరూ నీవే ఆమెకు నకిలీ భర్తగా నటించాలని చెప్పారు. ఆ యువతి అతన్ని ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఇతనే తన భర్త (ఫేక్) అని పరిచయం చేసింది. కొన్ని డాక్యుమెంట్స్ (నకిలి) చూసిన ఆమె కుటుంబ సభ్యులు నిజమే అనుకున్నారు.
కొన్ని రోజులు కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న తరువాత ఇద్దరూ తిరిగి పూణే చేరుకున్నారు. మా ఇద్దరికి వివాహం అయ్యిందని ఆ యువకుడు ఆమె కళ్లుగప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు.
తరువాత వీలు చిక్కినప్పుడు ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనతోనే జీవితాంతం ఉండాలని లేదంటే నీ కుటుంబ సభ్యులను చంపేస్తానని అతను బెదిరించాడు. ఆమె కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పలేకపోయింది.
నిత్యం లైంగిక దాడి చేస్తున్న నకిలి భర్త మీద ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మీద లైంగిక దాడి చేసిన వ్యక్తి పరారైనాడని, అతను అహమ్మద్ నగర్ లో తలదాచుకున్నాడని తెలిసిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications