సెక్స్ రాకెట్: స్పా పేరిట విదేశీ వనితలతో వ్యభిచారం
మసాజ్ పార్లర్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్న వ్యవహారాన్ని మహారాష్ట్రలోని పూణే క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. స్పా పేరిట విదేశీ వనితలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న గుట్టును వారు రట్టు చేశారు.
పూణే : మసాజ్ పార్లర్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్న వ్యవహారాన్ని మహారాష్ట్రలోని పూణే క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. స్పా పేరిట విదేశీ వనితలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న గుట్టును వారు రట్టు చేశారు. పూణే నగరానికి చెందిన అనికేత్ శివాజీ (26) ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస వాడు.
శివాజీ హరిలాల్ సొసైటీలోని ఓ బంగ్లాను అద్దెకు తీసుకొని దానిలో తన స్నేహితులైన ఇమ్రాన్ అలీహుసేన్, కాకుసింగ్ చంద్రసింగ్‌లతో కలిసి విదేశీ అమ్మాయిలో స్పా పేరిట సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. పూణే పోలీసు క్రైం బ్రాంచి పోలీసు కానిస్టేబుల్ సంజయ్ కు ఈ సెక్స్ రాకెట్ బాగోతంపై సమాచారం అందింది.

దాంతో పూణే పోలీసు బృందం ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు చేయగా స్పాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు తేలింది. స్పాలో వ్యభిచారం చేస్తున్న ఐదుగురు థాయ్ లాండ్ కు చెందిన అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని వుమెన్స్ హోమ్‌కు తరలించారు.
థాయ్ మహిళలు టూరిస్టు వీసాలపై ఇక్కడికి వచ్చారు. విదేశీ అమ్మాయిలతో పెద్ద ఎత్తున వ్యభిచారం సాగిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 370 ఎ, 2, 3,4,5 ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications