నీలి చిత్రాలకు, సెక్స్‌కు నో: కవితా రైనా హత్య మిస్టరీ

ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఫార్మా కంపెనీ మేనేజర్ సంజయ్ రాణా సతీమణి కవితా రైనా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు నాలుగు నెలల కాలం పట్టింది. కవితతో పరిచయాన్ని పెంచుకుని ఆమెతో నీలి చిత్రాలు తీయడానికి నిందితుడు ప్రయత్నించాడని, అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని పోలీసులు గుర్తించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కవితా రైనా హత్య ఆగస్టు 24వ తేదీన జరిగింది. కవితా రైనాను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి గన్నీ బ్యాగుల్లో వాటిని వేసి అక్కడక్కడా పారేశారు. ఈ కేసును పోలీసులు తీవ్రంగా పరిణిగణించారు.

ఇండోర్‌లోని మిత్రబంధు నగర్‌లో కవితా రైనా నివాసానికి సమీపంలో ఉండే ఓ చీరల కొట్టు దుకాణం యజమానికి మహేష్ బైరాగి ఆ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తిచారు. హత్యకు ముందు ఆమెతో సెల్ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి మహేష్ బైరాగియేనని పోలీసులు కనిపెట్టారు.

Cops crack Kavita Raina murder case; boutique owner arrested

చివరగా వచ్చిన రెండు ఫోన్ కాల్స్‌లో ఒక్కటి భర్త నుంచి వచ్చింది కాగా, మరోటి బైరాగి నుంచి వచ్చిందని గుర్తించారు. దాంతో ఆ దిశగా దర్యాప్తు సాగించారు. గత మూడు నెలలుగా విచారణకు సహకరిస్తున్నట్లు నటిస్తూ తనకేమీ తెలియదని మహేష్ బైరాగి బుకాయిస్తూ వచ్చాడు. పోలీసుల విచారణలో ఏ మాత్రం బయట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అయితే, పోలీసులు అతని నోటి నుంచి వాస్తవాన్ని రాబట్టారు.

పోలీసులు అతన్ని మూడు సార్లు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. కవిత ఆ రోజు చీర కొనడానికి బైరాగి దుకాణానికి వెళ్లిందని, చీర ఇంట్లో ఉందని చెప్పి అతను ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లాడని, ఇంటికి వెళ్లిన తర్వాత లైంగిక వాంఛ తీర్చుకోవడానికి బలవంతెపెట్టాడని, ఆమె ప్రతిఘటించడంతో రాడ్‌తో కొట్టి చంపాడని పోలీసులు చెప్పారు.

ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆరు ముక్కలు చేసి గన్నీ బ్యాగుల్లో పెట్టి రాత్రి పూట నల్లాలో పడేశాడు. ఆ తర్వాత ఆమె స్కూటర్‌ను నవలఖ ప్రాంతంలో పార్కు చేసి వచ్చాడు. వీడియో లైబ్రరీని నడిపే బైరాగిని గతంలో అశ్లీల చిత్రాలను నిర్మించినందుకు పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+