జాబ్ ఆశపెట్టి తుపాకితో బెదిరించి రేప్: ఒకడి అరెస్టు

నేరానికి సంబంధించి తాము పంకజ్ శ్రీచంద్ బోత్రా అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. మే 30వ తేదీన ఇద్దరు వ్యక్తులు యువతిని అంధేరి నుంచి భయేందర్‌కు ఉద్యోగం ఇప్పిస్తామని పిలిపించుకున్నారు. ఆమె అక్కడికి వచ్చింది.
ఆమెను వెంటనే కారులోకి లాక్కుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీపక్ అనే పేరు గల వ్యక్తి కారులోనే తనపై అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపించింది. బోత్రా ఆమెపైకి రివాల్వర్ గురిపెట్టినట్లు ఆరోపిస్తున్నారు.
పట్టపగలు రద్దీగా ఉండే బ్యాంక్ ఎటిఎం వద్ద యువతిపై అత్యాచారం జరిపారు. ఆదివారంనాడు బోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications