సహాయ నటి హత్య: భర్తతో సహ ప్రియురాలు అరెస్టు
చెన్నై: తమిళనాడులో హత్యకు గురైన తమిళ సినిమా సహాయనటి హత్య కేసులో దంపతులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తేన్నారు. మదరంతపురానికి చెందిన శశిరేఖ అనే సహాయ నటి పోరూరు సమీపంలోని పూందమల్లి హైవే రోడ్డు పక్కన 2016 జనవరి 5వ తేదిన శవమై కనిపించింది.
శశిరేఖ అనే మహిళ ముడిపాక్కంకు చెందిన రమేష్ (32)ను రెండో వివాహం చేసుకుంది. అలందూరుకు చెందిన లత్తికా అనే మహిళతో రమేష్ అక్రమ సంబంధం సాగించాడు. ఈ విషయంలో నిత్యం రమేష్, శశిరేఖల మద్య గొడవ జరిగేది.

జనవరి 5వ తేదిన జరిగిన గొడవ సందర్బంగా రమేష్ శశిరేఖను హత్య చేశాడు. తరువాత రమేష్, లత్తికా ఆమె స్నేహితులు కలిసి శశిరేఖ తలను వేరు చేశారు. పూందమల్లి హైవే రోడ్డు సమీపంలోని కాలువలో శశిరేఖ మొండెం విసిరివేసి పరారైనారు.
తల వేరేచోట వేశారు. మొండెం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. శశరేఖ భర్త రమేష్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. అతను లత్తికాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెలుగు చూసింది. రమేష్, లత్తికాలను అరెస్టు చేశామని, వారి స్నేహితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications