హైదరాబాద్‌పై తేల్చని కోర్ కమిటీ భేటీ: సిబాల్ వివరణ

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాద్‌ను ఏం చేయాలనే విషయంపై కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం ఎటూ తేల్చలేదు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం ఎఐసిసి కోర్ కమిటీ గంటన్నరకు పైగా సమావేశమై తెలంగాణపై చర్చించింది. ఈ సమావేశంలో సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొన్నారు. న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబాల్ 40 నిమిషాల పాటు సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ అంశంపై కపిల్ సిబాల్ సమావేశంలో వివరణ ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం కష్టమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. జివోఎం రూపొందించిన ముసాయిదా నివేదికపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదా రాజ్యాంగ సవరణ చేయాలని కపిల్ సిబాల్ అన్నట్లు తెలుస్తోంది.

Core committee

రాజ్యాంగ సవరణకు బిజెపి అంగీకరించకపోతే తెలంగాణ బిల్లు ముందుకు సాగదని చిదంబరం అన్నట్లు తెలుస్తోంది. భద్రాచలంపై కూడా సమావేశంలో తర్జనభర్జనలు పడినట్లు తెలుస్తోంది. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలపాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంపు గ్రామాలు 20 నుంచి 30 ఉంటాయి.

కాగా, జివోఎం ముసాయిదా నివేదికపై ఎఐసిసి కోర్ కమిటీ తిరిగి ఈ నెల 25వ తేదీన చర్చించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 28 తేదీన ముసాయిదా బిల్లు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు, పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు డిసెంబర్ పదవ తేదీన రానున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ నెల 25వ తేదీననే జివోఎం మరోసారి భేటీ అవుతుందని, అదే రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమై జివోఎం సిఫార్సులను, తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, సీమాంధ్రకు భారీగా ప్యాకేజీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌పై నిర్ణయం చేయాల్సిన బాధ్యతను జివోఎం కోర్ కమిటీకే వదిలేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+