వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మహమ్మారి ఉగ్రరూపం: 2.80లక్షలకు పైగా కొత్తకేసులు;18లక్షలు దాటిన యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కొత్త కేసులు అంతకంతకు పెరుగుతూ మూడు లక్షలకు చేరుకున్నాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,82,970 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దేశంలో కేసులు రోజురోజుకు అంతకంతకూ పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

బాగా పెరుగుతున్న కరోనా కేసులు .. తాజాగా 2,82,970 కేసులు

బాగా పెరుగుతున్న కరోనా కేసులు .. తాజాగా 2,82,970 కేసులు

భారతదేశం యొక్క రోజువారీ కరోనావైరస్ (కోవిడ్ -19) కేసుల సంఖ్య 2,82,970కి పెరిగాయి. ముందటి రోజుతో పోలిస్తే 44,889 కేసులు అదనంగా పెరిగాయి. మొత్తం 18 శాతం మేర కొత్త కేసులు అదనంగా నమోదైన పరిస్థితి ఉంది. దేశం రోజువారీ లెక్కింపులో కొన్ని రోజుల స్వల్ప తగ్గుదల తర్వాత మళ్లీ కరోనా కేసుల ఉధృతిని చూస్తోంది.మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో భారత్ కరోనా మహమ్మారి కారణంగా దారుణ పరిస్థితులను చూడనుంది.

ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు తాజాగా 8,961 కేసులు

ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు తాజాగా 8,961 కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించిన డేటా ప్రకారం, ఓమిక్రాన్ వేరియంట్‌లో 8,961 కేసులతో సహా మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కి చేరుకుంది.మంగళవారం నుంచి ఒమిక్రాన్ కేసుల్లో 0.79 శాతం పెరుగుదల నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.కరోనా మహమ్మారికి గత 24 గంటల్లో 441 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు . దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,87,202 కి చేరుకుంది.

దేశంలో మొత్తం 18,31,000 యాక్టివ్ కేసులు

దేశంలో మొత్తం 18,31,000 యాక్టివ్ కేసులు

బుధవారం ఉదయం నాటికి, దేశంలో మొత్తం 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది గత ఏడు నెలల కంటే ఇదే అత్యధికం.డేటా ప్రకారం, మొత్తం కేసులలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.83 శాతంగా ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 93.88 శాతంగా ఉంది. రికవరీ రేటు తగ్గడం, యాక్టివ్ కేసులు రేటు పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.గత 24 గంటల్లో 1,88,157 మంది కరోనా మహమ్మారి నుండి నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు ఇప్పుడు 3,55,83,039కి చేరుకున్నాయి.

Recommended Video

Covid 19 : The Importance Of Being Vaccinated | Oneindia Telugu
రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం

రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం

డేటా ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉంది. అయితే వారానికి అనుకూలత రేటు 15.53 శాతంగా ఉంది. కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 158.88 కోట్ల మోతాదులను అందించారు. మంగళవారం నాడు 76,35, 229 మంది కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే 15 సంవత్సరాల నుండి 18 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి నిన్నటి వరకు 3.7 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందాయి.

English summary
On Tuesday, more than 18 lakh people were diagnosed with corona and 2,82,970 were diagnosed with corona positive. 441 people have lost their lives in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X