corona cases: కరోనా కేసులపై బాంబు పేల్చిన కేంద్రం..!
కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది. వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని హెచ్చరించాయి. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసులపై బుధవారం సమీక్ష నిర్వహించింది. అనంతరం కేసులు పెరుగుతాయని అంచనాకు వచ్చింది.
11వ తేదీ ఒక్క రోజే అత్యధికంగా 7 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వచ్చే రెండు వారాల్లో భారీగా కేసులు ఎందుకు పెరుగుతాయి అనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

కొత్త వేరియంట్ XBB.1.16 కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా ఎండమిక్ దశలో ప్రవేశించిందని.. వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని పేర్కొంది. ఆ తరువాత కేసులు తగ్గుతాయని వివరించింది. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కొవిడ్ తో 11 మంది మృతిచెందారు. అయితే గతేడాది ఆగస్టు తరువాత ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి.
మరో వైపు ఉచిత వ్యాక్సిన్ల ఇవ్వలేమని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్‌లను సరఫరా చేసుకోవాలని కోరింది. కరోనా టీకా కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే సొంత నిధుతలో కొనుగోలు చేసుకోవాలంటూ చెప్పింది. మూడో డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయడం లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటికే దాదాపు అందరికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు పేర్కొంది.
2021 జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్‌లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. ప్రభుత్వం ఉచితంగా అందించిన వ్యాక్సిన్లలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం రూ. 4,237 కోట్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications