• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా ఎఫెక్ట్ .. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం

|

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇక భారత్ లో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇప్పటికే భారత్ లో లాక్ డౌన్ ప్రకటించింది . ఇక దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రజలను కరోనా మహమ్మారి నుండి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నాన్నా .. బయటకు వెళ్తే కరోనా వస్తుంది.. వెళ్లొద్దు .. పోలీసుల కుటుంబాల్లో చిన్నారుల రోదన

ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన జనాభా లెక్కలు, ఎన్పీఆర్ లు వాయిదా

ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన జనాభా లెక్కలు, ఎన్పీఆర్ లు వాయిదా

ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన జనాభా లెక్కలు, ఎన్పీఆర్ లు వాయిదా వెయ్యాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్‌తో ఇప్పటికే ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇటు ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించాలనుకున్న కేంద్రం

ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించాలనుకున్న కేంద్రం

భారత ప్రధాని స్వయంగా 21రోజుల లాక్ డౌన్‌ను ప్రకటించడంతో ఇక అందరూ ఇళ్లకే పరిమితం అయిన నేపధ్యంలో జనాభా లెక్కలు సైతం వాయిదా పడ్డాయి. దేశ ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది . ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం అదే సమయంలో ఎన్‌పీఆర్ కూడా అప్‌డేట్ చేయాలనుకున్నారు.

ఎన్పీఆర్ ను వ్యతిరేకించిన చాలా రాష్ట్రాలు

ఎన్పీఆర్ ను వ్యతిరేకించిన చాలా రాష్ట్రాలు

దేశంలో అసలు ఎంత మంది నివసిస్తున్నారన్నది లెక్క తేల్చడమే ఎన్‌పీఆర్ ఉద్దేశం. అయితే ఎన్పీఆర్ , ఎన్నార్సీ విషయంలో వివిధ రాష్ట్రాలు పాజిటివ్ గా స్పందించలేదు . పలు అనుమానాలను వ్యక్తం చేశాయి.ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెల్ల నుంచి నివసిస్తున్నవారిని, లేదా రాబోయే ఆర్నెల్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నవారిని స్థానిక పౌరులుగా గుర్తించి ఇంటింటికీ వెళ్ళి ఆ వివరాలను నమోదు చేస్తారు.

  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
  దేశం మూడ్ మార్చేసిన కరోనా ... అన్నీ బంద్.. అందరిలో ఆందోళన

  దేశం మూడ్ మార్చేసిన కరోనా ... అన్నీ బంద్.. అందరిలో ఆందోళన

  అయితే ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాలు ఎన్పీఆర్ ను తమ రాష్ట్రాల్లో అనుమతించేది లేదంటూ అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశాయి. దేశంలో సీఏఏ , ఎన్నార్సీ లకు వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు జరిగాయి. ఢిల్లీ రక్త సిక్తం అయ్యింది. చాలా రాష్ట్రాలు అయితే జనగణనకు మాత్రం సహకరిస్తామని స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే కరోనా మాత్రం ఒక్కసారిగా దేశం మూడ్ మార్చేసింది. భయానక వాతావరణం తెచ్చి పెట్టింది. ఇళ్లకే పరిమితం అయ్యేలా లక్ష్మణ రేఖ గీసింది.

  English summary
  The central government has decided to postpone the census and NPRs from April 1. The Center seems to have made this decision in view of the corona outbreak. The government has already canceled all programs with the lockdown. The Central Election Commission has also postponed the Rajya Sabha elections. Elections for local bodies were also postponed in AP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X